
అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈ యువ బ్యాటర్ ఇప్పటికే తన తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. బరిలోకి దిగితే రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, అభిషేక్ శర్మ ప్రస్తుతం స్థిరమైన ప్రదర్శనలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుడు. గత 6 ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ 6 ఇన్నింగ్స్‌లలో అతను 3సార్లు జీరోకే ఔట్ కావడం గమనార్హం. అయితే అతను ఫామ్‌లో లేడని అర్థమవుతోంది.

ఎందుకంటే, నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. కానీ, రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సున్నాకి వికెట్ సమర్పించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో గౌహతిలో జరిగిన మూడో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అయితే, విశాఖపట్నంలో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో డకౌట్‌గా నిరాశపరిచాడు.

ఆ తర్వాత, తిరువనంతపురంలో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లో USAతో జరిగిన మ్యాచ్‌లో అతను సున్నాకి అవుట్ అయ్యాడు. అంటే, ఒక ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ మరో ఇన్నింగ్స్‌లో సున్నాకి వికెట్ సమర్పించుకున్నాడు. దీనికి నిదర్శనం గత 6 మ్యాచ్‌ల్లో 3సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. అంటే అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, అభిషేక్ శర్మ జీరో బాధితుడిగా మారడం గమనార్హం. ఇది టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది.