
సాధారణంగా ప్రతి రోజూ జుట్టు రాలిపోతూ ఉంటుంది. కానీ మరీ ఎక్కువగా జుట్టు రాలిపోతే మాత్రం సమస్యే. జుట్టు రాలిపోతూ ఉన్నా.. కొత్త జుట్టు రాకపోతేనే సమస్య. ఈ కాలంలో జుట్టు సమస్య బాగా వేధిస్తోంది. జుట్టు రాలిపోతూ.. కొత్త జుట్టు రాకుండా ఉంటే ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే.

జుట్టు పెరిగేందుకు ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలను తెలుసుకుంటున్నాం. జుట్టు కొత్తగా పెరిగేందుకు చియా సీడ్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి నెత్తి మీద ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

అంతే కాకుండా జుట్టు రాలడాన్ని అరికట్టి.. కొత్తగా జుట్టు పెరిగేందుకు సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్‌ని ఉదయం పూట తీసుకుంటే చాలా మంచిది. వీటిని జ్యూసులు, స్మూతీలు, పెరుగు, వోట్మీల్ వంటివి లేదా సాధారణ నీటితో అయినా తీసుకోవచ్చు.

చియా సీడ్స్ జుట్టును పెంచడంలో ఎలా సహాయ పడుతుందని అందరూ అనుకోవచ్చు. వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, జింక్, ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయ పడతాయి.

చిట్లిన జుట్టుకు చికిత్స చేయడానికి అరటిపండు సహాయపడుతుంది. అరటిపండు హెయిర్ ప్యాక్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందుకోసం పండిన అరటిపండును తీసుకుని బాగా మెత్తగా చేసి, అందులో పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. గంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరి.