Lambasingi: అక్కడ నుంచి ఆ ప్రకృతి చుస్తే రెండు కళ్ళూ చాలవు..!

| Edited By: Balu Jajala

Mar 05, 2024 | 7:01 PM

వంపులు తిరిగే వయ్యారాల ఘాట్ రోడ్డు.. కొండపై చల్లటి పిల్ల గాలులు.. సీజన్ లో మంచు అందాలు.. తెల్లటి మబ్బుల్లో నుంచి మసకగా కనిపించే ఆ సూర్యోదయాన్ని రెండు కళ్ళు చాలవు. ఆంధ్ర కాశ్మీరంగా పేరుగాంచిన లంబసింగి సమీపంలోని చెరువుల వేనం.... ఇప్పుడు ఆ ప్రకృతి అందాలను తనివి తీర ఆస్వాదించేందుకు వ్యూ పాయింట్లు పర్యాటకులను అందుబాటులోకి తెచ్చారు. ఆ న్యూ పాయింట్ల పైనుంచి చూస్తే.. అబ్బా ఆ స్వర్గసీమలా.. రెండు కళ్ళు చాలవు మరి..

1 / 5
 వంపులు తిరిగే వయ్యారాల ఘాట్ రోడ్డు.. కొండపై చల్లటి పిల్ల గాలులు.. సీజన్ లో మంచు అందాలు.. తెల్లటి మబ్బుల్లో నుంచి మసకగా కనిపించే ఆ సూర్యోదయాన్ని  రెండు కళ్ళు చాలవు. ఆంధ్ర కాశ్మీరంగా పేరుగాంచిన లంబసింగి సమీపంలోని చెరువుల వేనం.... ఇప్పుడు ఆ ప్రకృతి అందాలను తనివి తీర ఆస్వాదించేందుకు వ్యూ పాయింట్లు పర్యాటకులను అందుబాటులోకి తెచ్చారు. ఆ న్యూ పాయింట్ల పైనుంచి చూస్తే.. అబ్బా ఆ స్వర్గసీమలా.. రెండు కళ్ళు చాలవు మరి...

2 / 5
అల్లూరి జిల్లా ఏజెన్సీ అంటే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. ఎత్తైన కొండలు జాలువారే జలపాతాలకు తోడు.. లోతైన లోయలో ఇక్కడి స్పెషల్ ఎట్రాక్షన్. శీతాకాలంలో ఇక్కడి మంచు అందాలు కట్టిపడేస్తుంటాయి. ఇప్పటికే పాడేరు వంజంగి మేఘాలకొండ, అరకు లోయ మాడగడ వ్యూ పాయింట్ లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయా ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు చింతపల్లి ఏజెన్సీ లోని.. చెరువుల వేనం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

3 / 5
ప్రకృతి స్వర్గసీమగా ఉండే చెరువుల వేనం..  సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇక్కడి కూల్ క్లైమేట్ తో విపరీతంగా ప్రాచుర్యం పొందడంతో పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. శీతాకాలం కాదు.. వేసవిలోనూ చల్లటి వాతావరణం ఉండే ఈ ఆంధ్ర కాశ్మీరం లాంటి లంబసింగ్ ఏజెన్సీ ఘాట్ రోడ్ ప్రత్యేక ఆకర్షణ. చెరువుల వేనం చూస్తే .. ఆ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు మరి. దీంతో భారీగా సందర్శకులు క్యూ కడుతున్నారు.

4 / 5
ప్రకృతి అందాలకు తోడు పర్యాటకుల డిమాండ్ నేపథ్యంలో.. చింతపల్లి ఏజెన్సీ లోని చెరువుల వేనం ఘాట్ రోడ్ లో  అభివృద్ధి పనులు చేపట్టారు. 2కోట్ల  నిధులతో రెండు వ్యూ పాయింట్లను నిర్మించి పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరువుల వేనంతో పాటు, ఘాట్రోడ్లో బోడకొండమ్మ ఆలయం వద్ద నిర్మించిన మరో వ్యూ పాయింట్ ను కూడా ఎంపీ మాధవి ప్రారంభించారు. ప్రతి పర్యటకుడి కి స్పెషల్ ఎట్రాక్షన్ గా అనుభూతిని కలిగించేందుకు ఈ వ్యూ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రకృతి అందాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా ఈ వ్యూ పాయింట్లను నిర్మించారు.

5 / 5
ఆ వ్యూ పాయింట్ల మీద నుంచి ప్రకృతి సుందర దృశ్యాలు చూస్తే.. స్వర్గసీమల అనిపిస్తూ ఉంటుంది. పైనుంచి చూస్తే లోయలో పాలపొంగులా కనిపిస్తూ అలల్లా తెలియడి పోయే మంచు మేఘాలు సుందర దృశ్యాలు కలివిందు చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. లంబసింగి ఘాటుకు వెళ్లి ఆ వ్యూ పాయింట్లపై నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించండి మరి.