హైదరాబాద్ మూసీ నదికి కొత్త రూపు.. రూ.7,055 కోట్ల భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

Edited By:

Updated on: May 08, 2026 | 6:38 PM

హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం నది క్లీన్ చేసే కార్యక్రమంగా కాకుండా, నగర భవిష్యత్తును మార్చే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.

1 / 5
హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం నది క్లీన్ చేసే  కార్యక్రమంగా కాకుండా, నగర భవిష్యత్తును మార్చే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆస్తులు, నివాసాలపై కనీస ప్రభావం మాత్రమే ఉండేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పారదర్శకతతో, ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా పనులు సాగించాలని సూచించారు.

2 / 5
భట్టి విక్రమార్క అధ్యక్షతన కీలక సమీక్ష: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. నిధుల సమీకరణ, నిర్మాణ పనుల క్యాలెండర్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఐదు దశల్లో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. తొలి దశను రూ.7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి నిధుల సమీకరణకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక చర్చలు పూర్తయ్యాయి. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రభావం లేని తొలి ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు.

3 / 5
మూసీకి కొత్త రూపు: ప్రాజెక్టులో భాగంగా నదిలోని చెత్త తొలగింపు, రివర్ బెడ్ ప్రొఫైలింగ్, వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడతారు. అలాగే నది ఇరువైపులా రోడ్లు, ప్రధాన మురుగు కాలువలు, బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నారు. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్‌లో భాగంగా నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రతిపాదించారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణకు డీపీఆర్ సిద్ధం అవుతోంది.

4 / 5
2026లో పనుల ప్రారంభం లక్ష్యం  : అన్ని అనుమతులు పూర్తి చేసి 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 2027 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా విస్తృత ప్రచారం చేపట్టాలని భట్టి విక్రమార్క సూచించారు. బస్టాండ్లు, ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సాంకేతిక సహకారం కోసం ఐఐటీ, జేఎన్‌టీయూ సంస్థల సేవలు వినియోగించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

2026లో పనుల ప్రారంభం లక్ష్యం : అన్ని అనుమతులు పూర్తి చేసి 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 2027 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా విస్తృత ప్రచారం చేపట్టాలని భట్టి విక్రమార్క సూచించారు. బస్టాండ్లు, ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సాంకేతిక సహకారం కోసం ఐఐటీ, జేఎన్‌టీయూ సంస్థల సేవలు వినియోగించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

5 / 5
రబ్బర్ డ్యాంలతో టూరిజం అభివృద్ధి : మూసీ నదిలో పలు ప్రాంతాల్లో రబ్బర్ డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు బోటింగ్, జలక్రీడల వంటి టూరిజం అవకాశాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి.
ఈ సమావేశంలో మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణ భాస్కర్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

రబ్బర్ డ్యాంలతో టూరిజం అభివృద్ధి : మూసీ నదిలో పలు ప్రాంతాల్లో రబ్బర్ డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు బోటింగ్, జలక్రీడల వంటి టూరిజం అవకాశాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. ఈ సమావేశంలో మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణ భాస్కర్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Follow Us