ఉల్లిపాయలు ఇక కుళ్లిపోవు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఎన్నిరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

Updated on: Nov 06, 2026 | 6:24 PM

వంటింట్లో ఉల్లిపాయ లేనిదే ఏ కూర రుచి కుదరదు. మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం సాధారణం. అయితే కొద్దిరోజులకే అవి లోపల మెత్తబడిపోవడం, కుళ్లిపోయి దుర్వాసన రావడం లేదా పచ్చని మొలకలు రావడం వంటి సమస్యలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సరైన నిల్వ పద్ధతులు తెలియకపోవడం వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఉల్లిపాయలను నెలల తరబడి తాజాగా, గట్టిగా ఉంచుకోవచ్చు.

1 / 5
ఉల్లిపాయలు త్వరగా పాడైపోవడానికి ప్రధాన కారణం తేమ, సరిపడా గాలి లేకపోవడం. మార్కెట్ నుంచి తెచ్చిన ఉల్లిపాయలను చాలామంది ప్లాస్టిక్ కవర్లలోనే అలాగే ఉంచేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లలో గాలి ప్రసరణ ఉండదు కాబట్టి ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే సహజ తేమ లోపలే బందీ అయి బూజు పట్టడానికి దారితీస్తుంది. అందుకే వాటిని తెచ్చిన వెంటనే ప్లాస్టిక్ కవర్ల నుంచి తీసి, గాలి ధారాళంగా ఆడే జనపనార సంచులు, నెట్ బ్యాగులు లేదా చిల్లులున్న వెదురు బుట్టల్లో మాత్రమే వేసి ఉంచాలి.

2 / 5
ఉల్లిపాయలను భద్రపరిచే ప్రదేశం కూడా వాటి మనుగడను నిర్ణయిస్తుంది. ఎండ నేరుగా తగిలే కిటికీల దగ్గర గానీ, గ్యాస్ స్టవ్ పక్కన గానీ వీటిని పెట్టకూడదు. అధిక వేడి, వెలుతురు తగిలితే ఉల్లిపాయల్లో మొలకలొచ్చే ప్రక్రియ వేగవంతమవుతుంది. అలాగే సింక్ కింద ఉండే తేమ ప్రదేశాల్లో అస్సలు పెట్టొద్దు. వీలైనంత వరకు ఇంట్లో చల్లగా, పొడిగా, చీకటిగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ భద్రపరిస్తే ఉల్లిపాయలు చాలాకాలం పాటు తమ ఘాటును, గట్టిదనాన్ని కోల్పోకుండా ఉంటాయి.

3 / 5
వంటింట్లో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఉల్లిపాయలను, బంగాళాదుంపలను ఒకే బుట్టలో కలిపి పెట్టడం. బంగాళాదుంపలు ఇథిలీన్ అనే సహజ వాయువును, అధిక తేమను విడుదల చేస్తాయి. ఈ వాయువు ఉల్లిపాయలకు తగిలితే అవి చాలా వేగంగా మొలకలొచ్చి, కుళ్లిపోతాయి. అలాగే ఉల్లిపాయలు వెదజల్లే తేమ వల్ల బంగాళాదుంపలు కూడా పాడవుతాయి. కాబట్టి ఈ రెండింటినీ ఎప్పుడూ ఒకదానికొకటి దూరంగా, వేర్వేరు బుట్టల్లోనే ఉంచాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

4 / 5
చాలామంది ఉల్లిపాయలు పాడైపోతాయేమోనన్న భయంతో ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ పొట్టు తీయని పచ్చి ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని చల్లదనానికి పిండి పదార్థాలు చక్కెరగా మారి త్వరగా మెత్తబడతాయి. పైగా ఫ్రిజ్ మొత్తం ఉల్లిపాయ ఘాటు వ్యాపిస్తుంది. అయితే అట్టపెట్టెలో న్యూస్‌పేపర్ పరిచి లేదా రంధ్రాలు చేసిన బ్రౌన్ పేపర్ బ్యాగుల్లో ఉల్లిపాయలను ఉంచితే అవి తేమను పీల్చుకుని రెండు నుంచి మూడు నెలల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి.

5 / 5
చివరగా నిల్వ చేసిన ఉల్లిపాయల బుట్టను వారానికోసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలి. బుట్టలో ఉన్న వంద ఉల్లిపాయల్లో ఒక్కటి మెత్తబడినా, కుళ్లిపోయినా ఆ తేమ, ఫంగస్ పక్కనున్న మిగతా ఉల్లిపాయలకు వేగంగా వ్యాపిస్తుంది. అందుకే స్వల్పంగా పాడైన ఉల్లిపాయ కనిపించినా వెంటనే దాన్ని వేరు చేసి పారేయాలి. ఈ చిన్నపాటి మెలకువలు పాటిస్తే ఉల్లిపాయలు వృథా కాకుండా ఉండటమే కాకుండా కష్టపడి సంపాదించిన డబ్బు కూడా ఆదా అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us