
కావాల్సిన పదార్ధాలు : 5 ఉడికించిన గుడ్లు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, తాలింపు గింజలు, అర టీ పసుపు, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా కోడి గుడ్లను ఉడికించి పెంకులు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి కోడిగుడ్లను బాగా వేయించాలి.

స్పూన్ తో కోడిగుడ్ల మీద గాట్లు పెడితే వేగుతాయి. గోల్డ్ రంగులోకి మారే వరకు వేయించాలి. బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.

రెండు టేబుల్ స్పూన్స్ కారం, మసాలా పొడులు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి కరివేపాకులు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

కోడిగుడ్ల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. ఆ తర్వాత మెంతి పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివరిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే, కోడిగుడ్లు పచ్చడి రెడీ.