నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!

Updated on: Jan 20, 2026 | 1:39 PM

నిల్వ పచ్చళ్లు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. చాలా మంది వెజ్, నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లను ఇష్టపడుతుంటారు. ఇక చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అందరికీ తెలుసు. కానీ చాలా మందికి కోడి గుడ్డు నిల్వ పచ్చడి గురించి తెలియదు. అయితే ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే కోడి గుడ్డు నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : కోడి గుడ్లు ఎనిమిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్, ఆవ నూనె వన్ టేపు స్పూన్, గరం మసాలా నాలుగు టీ స్పూన్స్, కారం రెండు టీ స్పూన్స్, జీలకర్ర రెండు టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడ, మెంతి పొడి, ఆవ పొడి వన్ టీ స్పూన్, ధనియాల పొడి వన్ టీ స్పూన్ , కరివేపాకులు , రెండు నిమ్మకాయలు.

2 / 5
తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది ఎగ్స్‌ను పగల గొట్టి, ఆ మిశ్రమం బౌల్‌లో పోసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి  ఆ మిశ్రమాన్ని ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి.

3 / 5
తర్వాత దీనిని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసి, మనం ఆవిరిలో ఉడకబెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్‌ను చిన్న పీసులుగా కట్ చేసుకొని, నూనెలో ఫ్రై చేసుకోవాలి.

4 / 5
తర్వాత అదే నూనెలో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఆవాల పొడి, కారం, రుచికి సరిపడ ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్ పీస్‌లను అందులో వేసి కలిపి పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకొని, ఐదు గంటల తర్వాత తింటే ఆ టేస్టే వేరే లెవల్‌లో ఉంటుంది.

5 / 5
మరి మీరు కూడా టేస్టీ టేస్టీగా ఉండే కోడి గుడ్డు నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ట్రై చేయండి మరి. ఇది చిన్ని పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారంట.