పుచ్చకాయ తొక్కలతో టేస్టీ దోశలు.. ఎలా చేసుకోవాలో తెలుసా?

Updated on: Mar 16, 2026 | 1:50 PM

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా పుచ్చకాయ తింటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, నీరసం, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే చాలా మంది పుచ్చకాయ లోపలి గుజ్జు తిని, తొక్కలు పాడేస్తుంటారు. కానీ వీటి తొక్కలతో అదిరి పోయే టేస్టీ దోశలు తయారు చేయవచ్చు అని చెబుతున్నారు నిపుణులు, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పుచ్చకాయ తొక్కలతో దోశ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు : పుచ్చకాయ తొక్కలు, పుచ్చకాయ , చివరి గ్రీన్ కలర్ తొక్క తీసి వేయగా మధ్యలో ఉండే వైట్ కలర్ తీసుకోవాలి. అ నానబెట్టిన బియ్యం. దాదాపు రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. పచ్చి మిర్చి, అల్లం, కొబ్బరి పొడి, మినపప్పు ఒక కప్పు.

2 / 5
తయారీ విధానం : ముందుగా పుచ్చకాయ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో పుచ్చకాయ తొక్క ముక్కలు, బియ్యం, పచ్చి మిర్చీ, అల్లం, కొబ్బరి పొడి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దోశ మంచిగా వచ్చేలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు దోశ మిశ్రంలో ఉప్పు వేసి బాగా కలిపి రాత్రి వెచ్చటి ప్రదేశంలో పెట్టుకోవాలి. దీంతో పిండి మంచిగా పులికి, దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, దోశ పాన్ పెట్టాలి. నెయ్యి లేదా నూనె వేసి దోశ వేసుకోవాలి. ఇక ఇది గోల్డ్ రంగులో వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పుచ్చకాయ తొక్కల దోశ రెడీ.

5 / 5
ఇక ఈ దోశను కొబ్బరి చట్నీ లేదా, అల్లం చట్నీలో తింటే టేస్ట్ అదిరిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ దోశ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

Follow Us