
కావలసిన పదార్థాలు: ఒక కప్పు మునగఆకులు, చింతపండు రసం, ఒక టొమాటో, రెండు ఉల్లిపాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

ముందుగా చింతపండును రసాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మునగాకు, కట్ చేసిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం దానిలో ఒక గ్లాస్ నీరు పోసి బాగా ఉడికించాలి.

మునగాకులు మొత్తం ఉడికిన తర్వాత చింతపండు రసం పోసి దానిలో పది నిమిషాలు రంగు మారే వరకు బాగా మరిగించాలి.

ఇక ఇప్పుడు కొత్త పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి ఆ తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు , కరివేపాకు ఆకులు వేసి తాలింపు పెట్టుకోవాలి.

తాలింపు పెట్టుకున్న ఈ పోపును మునగాకు చారులో వేసి, 5 నిముషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించేయండి. అంతే, వేడి వేడి మునగాకు చారు రెడీ.