
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు చికెన్ బోన్‌లెస్, 4 కోడి గుడ్లు, ఒక ఉల్లిపాయ చిన్నది, 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ మసాలా, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, ఉప్పు, రెండు టేబుల్ నూనెను తీసుకోవాలి.

మెత్తని చికెన్‌ను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి డానికి ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలో కోడి గుడ్లను బ్రేక్ చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన మిర్చి, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, మసాలా పొడులు వేసి బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమంలో ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి దానిలో నూనె వేసి బాగా వేడి అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోసి రెండు వైపులా బాగా కాలనివ్వాలి. అంతే, వేడి వేడి చికెన్ ఆమ్లెట్ రెడీ.