
బాడీని బలంగా ఉంచాలంటే తినాల్సింది పిజ్జాలు కాదు ఈ రెసిపీ . శరీరాన్ని చిటికెలో ఉక్కులా మార్చే ఈ వంటకానికే ఉంది. మీరు రోజు ఉదయం టిఫిన్ బదులు దీనిని తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇది తినే తాతలు 60 లలో కూడా ఉక్కులా పని చేశారు. మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మినుముల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు మినుములు, అర కప్పు బియ్యం, అర కప్పు బెల్లం, ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె , 10 కిస్ మిస్ లు 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులను తీసుకోవాలి. అప్పటి రోజుల్లో బాగా తినేవాళ్లు.

మినుముల పాయసం తయారీ విధానం: ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి దాని మీద పాన్ పెట్టి దానిలో 1 కప్పు మినుములు వేసి మీడియం మంటపై వీటిని బాగా వేయించుకోవాలి. ఎంతలా అంటే ఈ మినుములు సువాసన వచ్చేదాకా వీటిని బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత దానిలోనే 1 స్పూన్ బియ్యం వేసి వేయించాలి.

ఇవి బాగా వేగిన తరవాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వీటిలో వేయించిన మినుములు, బియ్యం కూడా వేసి మిక్సీ గిన్నెలో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ తరవాత ఈ పొడిని తీసుకుని దీనిలో ఒక కప్పు నీళ్లు పోసుకొని కొద్దిగా కూడా ఉండలు లేకుండా దీనిని కలుపుకొని పక్కన పట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్లు పోసి తిప్పాలి

ఈ నీళ్లు బాగా వేడి అయినా తరవాత ముందుగా పట్టిన పిండిని కూడా దీనిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తరవాత దీనిలో అర కప్పు బెల్లం తురుము కూడా వేసి 5 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించాలి. ఆ తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి బాదం,జీడిపప్పు వేసి స్టవ్ మీదే రెండు నిముషాలు ఉంచి దించేయండి. వేడి వేడి మినుముల పాయసం రెడీ.