
కావాల్సిన పదార్దాలు : ఒక లీటర్ పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లేదా వెనిగర్, ఒక కప్పు బెల్లం, నాలుగు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి.

ముందుగా ఒక లీటర్ పాలను తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత వెంటనే దానిలో నిమ్మరసం లేదా వెనిగర్ పాలు మొత్తం విరిగిపోతాయి. వెంటనే దానిలో ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇలా వేస్తే పులుపు తగ్గతుంది.

విడిపోయిన పాలను తీసుకుని ఒక క్లాత్ మీద వేసి దాని నుంచి పిండిని వేరు చేయాలి. ఈ చెన్నాను తీసుకుని 15 నిముషాల పాటు మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఇంకా దీనిని స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండేలా చేసుకోవాలి.

ఆ ముద్దను తీసుకుని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ఇవి క్రాక్స్ లేకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తినడానికి రసగుల్లాలు మెత్తగా ఉంటాయి.

ఇప్పుడు బెల్లం , రెండు కప్పుల నీరును వేసి వాటిని బాగా మరిగించాలి. బెల్లం పూర్తిగా మరిగిన వడకట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేస్తే రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మరుగుతున్న బెల్లం పాకంలో ఈ బంతులను వేయాలి. అంతే, వేడి వేడి బెల్లం రసగుల్లలు రెడీ.