
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ములక్కాయలు ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి పరిశోధనల్లో కూడా తేలింది.

ముందుగా ఎండు చేపలను తీసుకుని పసుపుతో బాగా కడిగి వేడి నీటిలో పావు గంట నానబెట్టి మంచి నీళ్ళతో శుభ్రం చేయండి. దీని వల్ల వాసన పోతుంది.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, అర టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

ఉల్లిపాయలు ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు అర టీ స్పూన్ పసుపు వేసి మగ్గనివ్వాలి.

ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత ఎండు చేపలను వేసి బాగా వేయించాలి. ఇప్పుడు చింతపండు పులుసు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక గ్లాస్ నీళ్లు పోసి మిక్స్ అయ్యే కలపాలి. మీడియం మంటపై 15 నిమిషాల పాటు ఉంచి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి మునక్కాడ ఎండు చేపలు పులుసు రెడీ.