
ముందుగా ఎండుచేపలను తీసుకుని వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉప్పు నీటితో బాగా కడిగి క్లీన్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక పాన్‌లో ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న ఎండు చేపలను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.

ఇంకా ఎండు చేపలను వండేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇంకా మీరు కుక్ చేసేటప్పుడు వండేటప్పుడు ఒక టేబుల్ చింతపండు రసం కానీ ఒక కప్పు పాలు పోసిన కానీ నీచు వాసన మొత్తం పోతోంది.

ఎండు చేపలను వాసనను పూర్తిగా పోగొట్టే చిట్కాలు: మీరు కూర వండటానికి ప్రిపేర్ అయ్యే ముందు ఎండు చేపలను వేడి నీటిలో నానబెట్టి దానిలో ఐదు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి 20 నిమిషాలు బెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.