
కావాల్సిన పదార్దాలు: పావు కిలో చికెన్ లివర్, 1 ఉల్లిపాయ , 2 టమోటాలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మాసాలా పొడి, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

ముందుగా చికెన్ లివర్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి అర టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు నీటితో కడిగితే ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటాలు ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి.

ఇక ఇప్పుడు లివర్ ముక్కలు పసుపు, ఉప్పు, కారం వేసి 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టి కొంచం నీళ్లు పోసి అలాగే ఉంచండి. దించేముందు కొత్తిమీర వేసుకుని దించేయండి.