
మీ వేగం సరైనదని ఎలా అర్థం చేసుకోవాలి?: దీని గురించి పెద్దగా సాంకేతికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ నియమాన్ని గుర్తుంచుకోండి. మీరు 30 నిమిషాల్లో 2.5 కిలోమీటర్లు నడిస్తే, మీ వేగం సరైనది. ఈ వేగంతో, మీ శరీరం ఐదు నిమిషాల తర్వాత చురుగ్గా అనిపించడం ప్రారంభిస్తుంది.

భోజనం తర్వాత: చాలా మంది తిన్న వెంటనే పడుకుంటారు. కానీ భోజనం చేసిన తర్వాత 10 నుండి 20 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

Walking

అది మీ దినచర్యలో భాగమైనప్పుడు, సాకులు తగ్గుతాయి. నడుస్తున్నప్పుడు మీ మొబైల్‌ను దూరంగా ఉంచండి. ప్రతి ఫోన్ నోటిఫికేషన్ కోసం వేచి ఉండటం వల్ల మీ వ్యాయామం పాడవుతుంది. అందువల్ల ఫోన్ ని సైలెంట్‌లో పెట్టండి. సమయం చూడటానికి మీ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌ని చూడండి. మీ నడక తర్వాత కాల్స్ లేదా సందేశాలకు సమాధానం ఇవ్వండి. ఈ 30 నిమిషాలు మీ శరీరానికి, మనసుకు మాత్రమే ఉపయోగపడాలి.

కొంచెం బరువుతో నడక: నడుస్తున్నప్పుడు వెనుక చిన్న బ్యాక్‌ప్యాక్ ధరించడం లేదా తేలికపాటి బరువులు చేతిలో పట్టుకోవడం వల్ల శరీరం మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.

ఇంటర్వెల్ వాకింగ్: ఒకే వేగంతో కాకుండా వేగాన్ని మారుస్తూ నడవండి. ఉదాహరణకు ఒక నిమిషం పాటు చాలా వేగంగా నడిచి, తర్వాతి నిమిషం నెమ్మదిగా నడవండి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ రెట్టింపు అవుతుంది.