Fake Eggs: ఓరీ దేవుడో మనం తింటున్న గుడ్డు నకిలీదా..? తెలుసుకోపోతే చాలా డేంజర్!

Updated on: Jan 26, 2026 | 9:58 PM

చలికాలంలో గుడ్ల అమ్మకాలు బాగా పెరుగుతాయి. అధిక డిమాండ్ కారణంగా మార్కెట్లలో నకిలీ గుడ్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి. మార్కెట్లలో అసలైన, నకిలీ గుడ్లకు తేడాను గుర్తించడం కష్టంగా మారింది. కాబట్టి గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అలాంటప్పుడు నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
 గుడ్లలో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి5, విటమిన్ బి12, బి2, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ డి, బి6, విటమిన్ ఇ, మరియు ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కానీ,  గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు నిజమైన, నకిలీ గుడ్ల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తప్పక తెలిసి ఉండాలి. ఈ కృత్రిమ గుడ్లలో జిలాటిన్, రంగులు, రసాయనాలు, కోగ్యులెంట్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. నకిలీ గుడ్డు పెంకు చాలా నునుపుగా ఉంటుంది. కొద్దిగా మెరిసేలా ఉంటుంది. అసలైన గుడ్డును కదిలిస్తే శబ్దం రాదు. నకిలీ గుడ్డును కదిలిస్తే శబ్దం వస్తుంది.

2 / 5
నకిలీ గుడ్డు పెంకు ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సులభంగా ఊడిపోతుంది.  నకిలీ గుడ్డులోని పచ్చసొన వదులుగా ఉంటుంది. కొన్నిసార్లు చిక్కగా లేదా నీరులా ఉంటుంది.
నిజమైన గుడ్లు కొద్దిగా గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటాయి. బరువులో సమతుల్యంగా ఉంటాయి. నకిలీ గుడ్లు తరచుగా చాలా బరువుగా లేదా చాలా తేలికగా ఉంటాయి.

నకిలీ గుడ్డు పెంకు ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సులభంగా ఊడిపోతుంది. నకిలీ గుడ్డులోని పచ్చసొన వదులుగా ఉంటుంది. కొన్నిసార్లు చిక్కగా లేదా నీరులా ఉంటుంది. నిజమైన గుడ్లు కొద్దిగా గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటాయి. బరువులో సమతుల్యంగా ఉంటాయి. నకిలీ గుడ్లు తరచుగా చాలా బరువుగా లేదా చాలా తేలికగా ఉంటాయి.

3 / 5
నిజమైన గుడ్డు పెంకులు కొద్దిగా గరుకుగా, దృఢంగా ఉంటాయి. అయితే నకిలీ గుడ్డు పెంకులు నునుపుగా లేదా ప్లాస్టిక్ లాగా అనిపించవచ్చు. ఒక లోతైన గిన్నెలో నీటితో నింపి అందులో గుడ్డు ఉంచండి. నిజమైన గుడ్డు సాధారణంగా నీటిలో తేలదు, బదులుగా అడుగున స్థిరంగా ఉంటుంది. నకిలీ గుడ్డు చాలా తేలికగా ఉంటుంది. పైన తేలుతుంది.

4 / 5
నిజమైన గుడ్డు తాజాగా ఉంటే, దానికి వాసన ఉండదు. అయితే, నకిలీ గుడ్లు రసాయనాల వల్ల ప్రభావితమవుతాయి. స్వల్ప రసాయన వాసన కలిగి ఉండవచ్చు. గుడ్డు బలమైన లేదా వింతైన వాసన కలిగి ఉంటే, దానిని కొనకండి.

5 / 5
నిజమైన గుడ్డు వండినప్పుడు సహజంగా గట్టిపడుతుంది. తెల్లసొన, పచ్చసొన ప్రత్యేకంగా ఉంటాయి. నకిలీ గుడ్డు పూర్తిగా గట్టిపడుతుంది లేదా కరిగి వింతగా కలిసిపోతుంది. నకిలీ గుడ్డు పచ్చసొన తేలికైన రంగులో ఉంటుంది. ఈ విధంగా, మీరు నిజమైన, నకిలీ గుడ్డు మధ్య తేడాను గుర్తించవచ్చు.