Potatoes: మార్కెట్‌కు వెళ్లే పనిలేదు.. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా ఆలూ పండించుకోండి!

Updated on: Nov 21, 2026 | 9:08 AM

భారతీయ వంటకాల్లో ఆలూకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఆలూ వంటకాలు ఉంటాయి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేయడంతో జనాలు ఎక్కువగా దీన్ని ఆహారంలోకి చేర్చుకుంటారు. అయితే వీటిని పండించడానికి చాలామంది పెద్ద పొలం, గార్డెన్ ఉండాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు వీటిని మన బాల్కనీలో చిన్న కుండీ సహాయంతో కూడా పెంచుకోవచ్చని మీకు తెలుసా? అవును, ఇంట్లోనే సులభంగా బంగాళాదుంపలు పండించవచ్చు. ముఖ్యంగా నవంబర్ నెల ఈ సాగుకు మరింత అనువైనది. కాబట్టి ఇంట్లోనే బంగాళాదుంపలు ఎలా పండించాలో తెలుసుకుందాం.

1 / 5
మీరు ఇంట్లో ఆలుగడ్డలు పండించడానికి ముందుగా సరైన మట్టిని ఎంచుకోవాలి. ఇందుకోసం మీరు మరీ గట్టిగా ఉండే మట్టిని కాకుండా దుంపలు మంచిగా పెరగడానికి అనుకూలంగా ఉండేలా తేలికగా, గుల్లగా ఉండేలా మట్టిని సిద్ధం చేసుకోవాలి. దీనికోసం 50 శాతం తోట మట్టి, 40 శాతం పేడ ఎరువు , 10 శాతం ఇసుక కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మూడింటినీ బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి.

2 / 5
తర్వాత మార్కెట్‌కు వెళ్లి ఒక పెద్దపాటి కుండీని కొనుగోలు చేయండి. ఆ కుండీ ఎత్తుతో పాటు వెడల్పుగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మట్టి లోపల దుంపలు పెరగడానికి అనుకూలమైన స్థలం ఉంటుంది. అయితే మీరు ముందుగా సిద్ధం చేసిన మట్టిని కుండీలో వేయండి. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి.. మట్టిని పూర్తి కుండీ నిండా నింపరాదు. సగం మట్టి మాత్రమే వేయాలి. ఎందుకంటే మొక్క పెరుగుతున్న కొద్దీ కాండం చుట్టూ మళ్లీ మట్టి వేయాల్సి ఉంటుంది. అందుకే పైన కొంత స్థలం ఖాళీగా ఉంచడం అవసరం.

3 / 5
తర్వాత స్ప్రౌటెడ్ పొటాటోస్ (అంటే మొలకెత్తిన ఆలూ) తీసుకుని వాటిని కుండీలోని మట్టిలో సుమారు 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గుంత తీసి.. అందులో మొలకలు ఉన్న దుంపను ఉంచి, పైన తేలికపాటి మట్టితో కప్పాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు చల్లాలి, తద్వారా మట్టిలో తేమ నిలిచి ఉంటుంది. బంగాళాదుంపలు నాటడానికి నవంబర్ నెల అనుకూలమైనది. ఎందుకంటే ఆలూ మొక్క సుమారు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద బాగా ఎదుగుతుంది.

4 / 5
అయితే మీరు దుంపను మట్టిలో నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత మొక్కకు సేంద్రియ ఎరువు వేయాలి. ఇందుకోసం పేడ ఎరువు లేదా వర్మీకంపోస్ట్ ఎరువును మట్టిలో సమాన భాగాలుగా కలిపి మొక్క మొదట్లో వేయాలి. దాదాపు 30 రోజుల తర్వాత మళ్లీ ఎరువు వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి.

5 / 5
సాధారణంగా భూమిలో బంగాళాదుంప కాయడానికి దాదాపు 60 నుంచి 70 రోజుల సమయం పడుతుంది. మట్టిలో దుంపలు తయారైనప్పుడు పైన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అలా మారితే దుంపలు తీసే సమయం వచ్చిందని అర్థం. అప్పుడు మీరు జాగ్రత్తగా మట్టిని తొలగించి బంగాళాదుంపలను తీసుకోవచ్చు. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇంటి బాల్కనీలోనే ఆలుగడ్డలు పండించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us