కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్‌ చిట్కాలతో నిమ్మకాయ నుంచి చుక్క కూడా వదలకుండా పిండేయండి!

Updated on: Oct 10, 2026 | 9:05 PM

నిమ్మకాయ.. ఆది వంటకాలకు టేస్ట్ ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరెన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సార్లు మార్కెట్‌ నుంచి తెచ్చిన నిమ్మకాయల రసం పిండడం చాలా ఇబ్బందిగా మారుతుంది. పిండేడప్పుడూ రసం సరిగ్గా రాకపోవడం, వేస్ట్ అవ్వడం వంటివి జరుగుతాయి.అయితే, నిమ్మకాయ నుంచి సులభంగా, ఒక్క చుక్క కూడా వృథా కాకుండా పూర్తిగా రసం తీయడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1 / 5
హాట్ వాటర్ మ్యాజిక్: మీకు నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం రావాలంటే.. దాన్ని కోయడానికి ముందు 10 నుంచి 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. లేదంటే మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలో ఉంచి కేవలం 10 సెకన్ల పాటు స్వల్పంగా వేడి చేయండి. తర్వాత ఒక పాత్ర తీసుకొని నిమ్మకాయను పిండండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ లోపలి కణాలు వదులై రసం సులభంగా వస్తుంది.

2 / 5
చేతితో దొర్లించడం: చాలా మంది నిమ్మకాయను నేరుగా పిండుతుంటారు. అలా చేయడం వల్ల చేతులు నొప్పెట్టడంతో పాటు రసం సగం కిందపడి వేస్ట్ అవుతుంది. కాబట్టి నిమ్మకాయను కోయడానికి ముందు కటింగ్ బోర్డ్ లేదా బల్లపై పెట్టి, అరచేతితో కొద్దిగా ఒత్తిడి ఇస్తూ అటూఇటూ బాగా దొర్లించాలి. దీనివల్ల లోపలి తొనలు పగిలి రసం పూర్తిగా బయటకు రావడానికి సిద్ధమవుతుంది.

3 / 5
నిలువుగా కోయడం: సాధారణంగా చాలా మంది నిమ్మకాయను మధ్యలోకి అడ్డంగా కోస్తారు. కానీ అలా కాకుండా పొడవుగా నిలువుగా కోయాలి. ఎందుకంటే ఈ పద్ధతిలో కోయడం వల్ల పిండేటప్పుడు ఉపరితల వైశాల్యం పెరిగి సాధారణం కంటే ఎక్కువ రసం వస్తుంది. అంతేకాదు.. రసం కూడా వేస్ట్ కాకుండా ఎటూ చిట్లిపోదు.

4 / 5
ఫోర్క్ ట్రిక్: నార్మల్‌ ఇంట్లో నిమ్మకాయల నుంచి రసం పిండడానికి చాలా మంది స్క్వీజర్‌ను వాడుతుంటారు. కానీ అది లేనప్పుడూ మీరు మన ఇంట్లో వాడే ఫోర్క్‌తో కూడా రసాన్ని ఈజీగా తీయవచ్చు. ఇందుకోసం కట్ చేసిన నిమ్మకాయ ముక్క మధ్యలో ఫోర్క్‌ను గుచ్చి, దాన్ని అటూఇటూ తిప్పుతూ పిండితే రసం పూర్తిగా సులభంగా వచ్చేస్తుంది.

5 / 5
ఎండిపోయిన నిమ్మకాయలకు చిట్కా: చాలా మంది నిమ్మకాయలను కాస్త ఎండిపోగానే పారేస్తుంటారు. కానీ ఫ్రిజ్‌లో పెట్టి ఎండిపోయినట్లు మారిన నిమ్మకాయలను పారేయాల్సిన పనిలేదు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, ఆ నీటిలో ఎండిన నిమ్మకాయలను అరగంట పాటు నానబెట్టాలి. అవి మళ్లీ మెత్తబడి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పిండితో కావాల్సినంత రసం వస్తుంది. ఈ సింపుల్ చిట్కాలు వాడి మీరు కష్టపడకుండా ఈజీగా నిమ్మకాయ నుంచి రసం తీయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us