Glassy Skin: మొటిమలు, నల్ల మచ్చలకు చెక్.. ఆలూ ఫేస్ ప్యాక్ తో కొరియన్ లాంటి మెరిచే చర్మం మీ సొంతం

Updated on: Oct 31, 2026 | 1:26 PM

కొరియన్లలా మెరిసిపోయే గ్లాసీ స్కిన్ కావాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్‌లో దొరికే అనేక ఫేస్ క్రీములను వాడుతుంటారు. కానీ మన ఇంట్లో లభించే బంగాళాదుంపతో ఫేస్ మాస్క్ తయారుచేసి వాడితే, ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు కాంతివంతంగా మారుస్తుంది. మరి ఈ గ్లాసీ స్కిన్ ఫేస్ మాస్క్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
మీ చర్మం నిర్జీవంగా మారిందా? చిన్న వయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయా? అయితే కచ్చితంగా మీరు ఈ ఇంటి చిట్కా గురించి తెలుసుకోవాల్సిందే. ఖరీదైన ఫేస్ ప్యాక్‌లు వాడకుండా, కేవలం ఇంట్లో దొరికే పదార్థాలతోనే మీరు చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. అవును, వంటింట్లో ఉండే బంగాళాదుంప పిండి స్టార్చ్‌ తో ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి క్రమం తప్పకుండా అప్లై చేస్తే, తక్కువ సమయంలోనే మీ చర్మంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మరి ఈ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
తయారీ విధానం: బంగాళాదుంపతో బ్రైటనింగ్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళాదుంపను శుభ్రంగా కడిగి, తురుముకోవాలి. తర్వాత, ఆ తురుమును ఒక పలుచని గుడ్డలో వేసి గట్టిగా పిండాలి. ఇప్పుడు వచ్చిన బంగాళాదుంప రసాన్ని ఒక గాజు గిన్నెలో పోసి 15 నుంచి 20 నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత గిన్నె అడుగు భాగంలో తెల్లటి పొరలాంటి పిండి పదార్థం పేరుకుంటుంది.

3 / 5
ఇప్పుడు పైన తేలిన రసాన్ని మెల్లగా మరో గిన్నెలోకి వంపేసి, అడుగున మిగిలిన తెల్లటి పిండిని తీసుకోవాలి. ఆ పిండికి అర టీస్పూన్ పాలపొడిని కలపాలి. తర్వాత అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసి, మెత్తటి పేస్ట్‌లా అయ్యేంత వరకు బాగా కలపాలి. అంతే, బంగాళాదుంప పిండి ఫేస్ ప్యాక్ తయారైనట్లే.

4 / 5
వాడే విధానం: ముందుగా ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కొని, పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న పేస్ట్‌ను ముఖంపై పలుచని పొరలా అప్లై చేసి, సుమారు 20-25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, చర్మం పొడిబారకుండా ఉండేందుకు మంచి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖంపై ఉన్న ముడతలు, నల్లమచ్చలు తగ్గిపోయి, చర్మం కొరియన్ గ్లాస్ స్కిన్‌లా మెరిసిపోతుంది.

5 / 5
గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, వివిధ నివేదికల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. వీటిని మేము ధ్రువీకరించడం లేదు. వీటిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే ఏవైనా ఇంటి చిట్కాలు పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us