
Kitchen Tips: వంట చేసేటప్పుడు అయినా, చేయనప్పుడు అయినా నూనె తరచుగా నేలపై పడుతుంది. ఇది చాలా మంది ఇళ్లల్లో జరుగుతుంది. కొన్నిసార్లు దీనివల్ల అనేక ప్రమాదాలు జరగవచ్చు. ఇలా నేలపై నూనె పడితే దానిని కేవలం ఒక గుడ్డతో తుడిస్తే సరిపోదు. కొన్ని హోమ్ రెమీడిస్ ఆ మరకలను సులభంగా తొలగించడంలో మీకు సహాయపడతాయి. ఆ ఉపయోగపడే వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

నూనె మరక మీద కొద్దిగా బేకింగ్ సోడా చల్లండి. కాసేపు అలానే వదిలేసి, ఆ తర్వాత తడి గుడ్డతో లేదా బ్రష్‌తో రుద్ది మరకను తొలగించండి. బేకింగ్ సోడా నూనెను త్వరగా పీల్చుకుంటుంది. కాబట్టి, ఇకపై నూనె మరక గురించి చింతించాల్సిన అవసరం లేదు.

నూనె మరక పడిన చోట కొంచెం గిన్నెలు కడిగే ద్రవం లేదా సబ్బును రుద్ది కొంతసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఇది మరక, మురికిని చాలా వరకు తొలగించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ కలపండి. మీరు దీనిని మరక ఉన్న చోట స్ప్రే చేసి, కొంతసేపటి తర్వాత తుడిచివేయవచ్చు.

నూనె మరక తాజాగా ఉంటే, దానిపై కార్న్‌స్టార్చ్ లేదా పౌడర్ చల్లండి. ఇది నూనెను పూర్తిగా పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత దానిని తుడిచివేయండి. మరక చాలా మొండిగా ఉండి, తొలగించలేకపోతే, మీరు కాంక్రీట్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు.

నేలపై పడిన నూనెను దూది గుడ్డతో తుడిచి, పిండి లేదా బేకింగ్ సోడా చల్లండి. నూనె ఆ పొడిని పీల్చుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇవ్వండి. ఆ తర్వాత, గోరువెచ్చని నీటిలో కలిపిన డిష్‌వాషింగ్ లిక్విడ్ ద్రావణంతో తుడిచివేయండి.