మహిళలకు అదిరిపోయే న్యూస్.. వంట త్వరగా అవ్వాలంటే ఈ పాత్రలే బెస్ట్.. చిటికెలో అయిపోద్దీ!

Updated on: Jun 16, 2026 | 12:06 PM

Induction Stove Utensils Guide: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న గ్యాస్ కొరత, సిలిండర్ల రేట్ల కారణంగా చాలా మంది గ్యాస్ స్టవ్‌లకు గుడ్‌బై చెప్పి ఎలక్ట్రిక్ స్టవ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. చాలా మందికి వీటిని ఎలా వాడాలో ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఇవి సాధారణ గ్యాస్‌ స్టవ్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. వీటిపై మనం అన్ని పాత్రల్లో వంట చేయలేం. వీటిపై వండేందుకు కొన్ని ప్రత్యేక పాత్రలు ఉంటాయి. వాలో చేస్తే మాత్రమే వంట త్వరగా పూర్తవుతుంది. కాబట్టి మీరు కొనే పాత్రలు ఇండక్షన్ స్టౌకు సరిపోతాయా లేదా, మీ ఇంట్లో ఉన్న పాత పాత్రలను ఎలా పరీక్షించాలో తెలుసుకోవడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి. అంతేకాదు, ఇండక్షన్ స్టౌపై పని చేయని పాత్రలను కూడా పని చేసేలా చేసే ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

1 / 5
పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా ఇటీవల దేశ వ్యాప్తంగా తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో గ్యాస్ దొరకడం లేదు.. ఈ క్రమంలో దీనికి ఆల్‌టర్నేట్‌గా చాలా మంది ఇండక్షన్ స్టవ్( ఎలక్ట్రిక్ స్టవ్) లను వాడుతున్నారు. అయితే ఇవి సాధారణ గ్యాస్ స్టవ్‌లకు భిన్నంగా ఉంటుంది. వీటిపై కొన్ని ప్రత్యేక రకాల గిన్నెలు మాత్రమే పనిచేస్తాయి.

2 / 5
ఇండక్షన్ స్టౌ ఎలా పనిచేస్తుంది: ఇండక్షన్ స్టౌలు పాత్రకు, స్టౌ ఉపరితలం కింద ఉండే మ్యాగ్నెటిక్ కాయిల్స్‌కు మధ్య ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం ద్వారా పనిచేస్తాయి. ఈ విద్యుత్ అయస్కాంత క్షేత్రం వల్ల ఉత్పత్తయ్యే శక్తే గిన్నెలోని ఆహారాన్ని వేడి చేస్తుంది. దీనిపై వంట త్వరగా పూర్తవడమే కాకుండా.. ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అందుకే చాలా ఇప్పుడు దీనివైపు మొగ్గుచూపుతున్నారు.

3 / 5
ఇండక్షన్ స్టౌపై ఏ పాత్రలు వాడొచ్చు:  మీకు ఇండక్షన్‌పై వంట త్వరగా పూర్తి కావాలంటే కాస్ట్ ఐరన్, ఎనామిల్ పూత పూసిన కాస్ట్ ఐరన్, చాలా రకాల స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను వాడాలి. ఈ పాత్రలు ఇండక్షన్ స్టౌలపై చక్కగా పనిచేస్తాయి. దానికి సరిగ్గా సెట్‌ అయిత త్వరగా వంట పూర్తి అవుతంది. అయితే  స్టెయిన్‌లెస్ స్టీల్‌లోనూ అన్ని రకాల పాత్రలు దీనిపై పనిచేయవు. ఎందుకంటే స్టీల్ పాత్రలను ఇతర లోహాలను కలిపి తయారు చేస్తారు. కాబట్టి ఇది అయస్కాంత క్షేత్రాన్ని అడ్డుకోవచ్చు. కాబట్టి అలాంటి అల్యూమియం, స్టీమ్ మిశ్రమంతో చేసిన కొన్ని పాత్రలను దీనిపై వాడక పోవడమే మంచిది.

4 / 5
ఇండక్షన్ స్టౌపై వాడకూడని పాత్రలు: అల్యూమినియం, రాగి, గ్లాస్‌తో తయారు చేసిన ఏ పాత్రలు ఇండక్షన్‌పై పనిచేయవు. ఎందుకంటే ఇవి అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని కంపెనీలు వీటినిపై ఇండక్షన్‌పై కూడా వాడేందుకు వీలుగా వాటి అడుగు భాగంలో అయస్కాంత పొరను ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి వాటిని వాడొచ్చు కానీ.. గతంలో ఉన్న పాత ఆల్యూమీనియం, రాగి, గ్లాస్ పాత్రలను వాడకూడదు.

5 / 5
మీ ఇంట్లో ఉన్న గిన్నె ఇండక్షన్ స్టౌపై పనిచేస్తుందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక అయస్కాంతాన్ని తీసుకొని దాన్ని మీ ఇంట్లో పాత్ర అడుగుభాగానా తాకించి చూడండి.. ఆ అయస్కాంతం పాత్ర అడుగుభాగానికి గట్టిగా అతుక్కుంటే ఆ పాత్ర ఇండక్షన్ స్టౌపై చాలా బాగా పనిచేస్తుందని అర్థం. ఒక వేళ అది లైట్‌గా అతుక్కుంటే సరిగ్గా పనిచేయదని.. వంటకు లేట్‌గా అవుతుందని అర్థం. ఇక అస్సలూ అత్తుకోకపోతే.. అది ఇండక్షన్‌పై వంట చేయడానికి పనికిరాదని అర్థం.

Follow Us