
ఆస్ట్రేలియాలో “స్పైడర్ సీజన్” ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ వస్తుందంటే చాలు చాలా మంది భయపడి పారిపోతారు.

ఇది క్యాలెండర్‌లో ఉండే సీజన్ అయితే అస్సలు కాదు. వెన్నులో వణుకుపుట్టించే భయంకరమైన సీజన్ అని చెప్పాలి.

అక్కడ ఏడాదిలో కొన్ని నెలల పాటు పెద్ద ఎత్తున స్పైడర్లు బయటకు రావడంతో ప్రజలకి కూడా భయంతో వణికిపోతారు. ఇంకా ఇవి గాల్లో కూడా ఎగురుతాయి.

ఆస్ట్రేలియాలో అక్కడ ఇక్కడ అని కాకుండా అంతటా వేల సంఖ్యలో స్పైడర్లు గూడ్లు కట్టుకుంటూ తిరుగుతాయి. ఇది లేట్ సమ్మర్ నుంచి మొదలవుతుంది.

భారీ వర్షాలు, వరదలతో తమ నివాస స్థలాలు ఎక్కడ కొట్టుకుపోతాయేమో అని ఈ సాలె పురుగులు బయటకొచ్చి సురక్షిత ప్రదేశాలను వెతుక్కుంటూ గుట్టల గుట్టలుగా బయటకు వస్తాయని అక్కడ వాళ్ళు చెబుతున్నారు.