Homemade Neem Soap: ఇంట్లోనే వేప సబ్బు ఇలా సులువుగా తయారు చేసుకోండి.. చర్మ సమస్యలన్నీ పరార్‌!

|

Jan 25, 2024 | 11:34 AM

వేపలోని ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేప చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వేపలో ఎన్ని ఔషధ గుణాలున్నాయంటే శరీర రక్తాన్ని కూడా పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఇది రక్తం నుండి విషాన్ని తొలగించడం ద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది. రక్తం శుభ్రంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిపి వేప కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది..

1 / 5
వేపలోని ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేప చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వేపలో ఎన్ని ఔషధ గుణాలున్నాయంటే శరీర రక్తాన్ని కూడా పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఇది రక్తం నుండి విషాన్ని తొలగించడం ద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది. రక్తం శుభ్రంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

2 / 5
మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిపి వేప కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఏ సమస్యా రాదు. వేప ఆకులు చర్మానికి కూడా మేలు చేస్తాయి. అలాగే వేప ఆకులు కడుపుకు కూడా చాలా ఉపయోగపడతాయి. వేపలో ముఖ్యమైన ఆమ్లాలు ఉంటాయి. వేప ఆకులను మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే ఎలాంటి కడుపు సమస్య అయినా సులభంగా తొలగిపోతుంది. కడుపు నొప్పి కూడా ఉండదు.

3 / 5
వేప ఆకులలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా జలుబును కూడా నయం చేస్తుంది. చర్మ సంరక్షణలో వేప  ప్రాముఖ్యత వెలలేనిది. వేప ఆకులతో చర్మం మచ్చలు, దద్దుర్లు పోగొట్టుకోవచ్చు.

4 / 5
వేప ఆకులను నీటిలో వేసి మరిగించి స్నానం నీటిలో కలుపుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. చాలా మంది వేప ఆకులు, పచ్చి పసుపు కలిపి మెత్తగా పేస్ట్‌ చేసి, ముఖానికి అప్లై చేస్తారు. ఇది మొటిమల సమస్యలను సులభంగా దూరం చేస్తుంది. ఈ వేప సబ్బు మార్కెట్‌లో దొరికే ఫేస్ వాష్ లేదా క్రీమ్ కంటే చాలా మంచిది. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

5 / 5
తాజా వేప ఆకులను ఒక గిన్నె తీసుకుని బాగా కడిగి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. తర్వాత  గ్లిజరిన్ సబ్బును చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో కరిగించాలి. వేప ఆకుల ముద్దను సబ్బు వేడిగా ఉన్నప్పుడు బాగా కలపాలి. అందులో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను బ్రేక్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సబ్బు మిశ్రమాన్ని సిలికాన్ అచ్చులో పోసి 2 గంటలపాటు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. అంతే సబ్బు రెడీ అయినట్లే. కల్తీ లేని వేప సబ్బును ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ సబ్బును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.