నోరూరించే ఎండు మిర్చి పచ్చడి.. ఇలా చేసి తింటే దగ్గు, జలుబు మాయం!

Updated on: Jun 28, 2026 | 8:10 PM

భారతీయ వంటకాల్లో కారం పేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ఆహారపదార్థాలతో దీనిని తిన్నా రుచి అదిరిపోతుంది. చాలా మంది చికెన్, మటన్ , చైనీస్ వంటకాలకు మరింత కారం చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువగా దీనిని మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. కాగా, అసలు ఈ పండు మిర్చి కారం పేస్ట్‌ను మనం ఇంటిలోనే సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : ఎర్రటి  మిరపకాయలు కప్పు, కాశ్మీరీ ఎర్ర కారం పొడి కప్పు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు కప్పు, అల్లం రెండు టేబుల్ స్పూన్స్, తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్స్, పంచదార రెండు టేబుల్ స్పూన్స్, సోయా సాస్ అర కప్పు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎర్ర మిరపకాయలు తీసుకొని అందులో వేయాలి. తర్వాత అందులో నే ఎర్రటి కాశ్మీరి కారం పొడి కూడా వేయాలి. ఒక సారి స్పూన్‌తో వీటిని కలపాలి.

3 / 5
తర్వాత అదే గిన్నెలో తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్ల నువ్వులు, చక్కెర, ఉప్పు, సోయాసాస్, అన్నీ పదార్థాలు వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తంగా బాగా కలిసేలా చూడాలి. అప్పుడే ఎండు మిర్చి పచ్చడి మంచి రుచిని ఇస్తుంది.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో రెండు కప్పుల నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత మనం ఇంతక ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ నూనెలో వేసి రెండు మూడు సార్లు మంచిగా కలుపుకోవాలి.

5 / 5
మంచిగా కలిసిన తర్వాత ఐదు, పదినిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కారం పచ్చడి రెడీ.దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వర్షాకాలంలో వచ్చే దగ్గు,జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Follow Us