
కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి, ఇంటిలోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవడం వలన చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లబడుతుంది. జుట్టు బలంగా, వేపుగా పెరుగుతుందంట. కాగా, ఆ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు : కొబ్బరి నూనె, మందార పువ్వులు, మందార ఆకులు, అలోవేరా, మెంతి గింజలు, ఉల్లిపాయ పొట్టు, కరివేపాకు.

తయారీ విధానంలోకి వెళితే: సహజంగా కొబ్బరి ముక్కలను కట్ చేసి ఎండకు ఎండబెట్టి నూనె తయారు చేసుకోవాలి. దీనిని ఒక సీసాలో మంచిగా భద్ర పరుచుకోవాలి. కొన్నిసార్లు తెల్లటి పదార్థం అడుగున చేరి నూనె పైన తేలుతుంది. అప్పుడు ఆ నూనెను ఒక బౌల్‌లో తీసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో మనం తీసుకున్న కొబ్బరి నూనె పోయాలి. తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మందార ఆకులు, పువ్వులు, అలోవేరా, మెంతి గింజలు, కరివేపాకు రెబ్బలు అన్నీ వేసి బాగా మరగబెట్టుకోవాలి.

నూనె సగం వరకు అయ్యి, రంగు మారాలి. అప్పుడే వాటిలో ఉన్న రసం మొత్తం నూనెకు పడుతుంది. నూనె రంగు మారి , అది సగం వరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. దీని వలన నూనె పూర్తిగా చల్లారుతుంది. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని నెత్తికి పెట్టుకోవాలి. దీని వలన జట్టు ఆరోగ్యంగా బలంగా తయారు అవుతుంది.