హాస్టల్‌లో ఉండే పిల్లలకు బెస్ట్.. దగ్గు జలుబుకు చెక్ పెట్టే చికెన్ వెల్లుల్లి కారం

Updated on: Oct 11, 2026 | 4:25 PM

చాలా మందికి చలికాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు ఎదురు అవుతుంటాయి. దీంతో వారికి కారం కారంగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. ముఖ్యంగా కాలేజ్ హాస్టల్స్, బయట ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్‌లో ఉన్నవారు ఎక్కువగా కారం పొడి తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే విధంగా చికెన్‌తో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
దీని కోసం ముందుగా కిలో  బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకుని, ఒక టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కనీసం అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో  రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, రెండు టీస్పూన్ల జీలకర్ర, కారానికి తగినట్లుగా 10-12 ఎండుమిర్చి, అర అంగుళం దాల్చినచెక్క, మూడు లవంగాలు, మూడు యాలకులు వేయండి.

2 / 5
 వీటిలో కొద్దిగా, అంటే ఒక టీస్పూన్ నూనె వేసి, చిన్న మంట మీద ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత పావు కప్పు కరివేపాకు వేసి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేవరకు చిన్న మంట మీద గరిటతో కలుపుతూ వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేలా చేూసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో  మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేయాలి.

3 / 5
మంటను మధ్యస్థంగా ఉంచి, గరిటతో కలుపుతూ చికెన్ ముక్కలు బంగారు రంగులోకి మారే వరకు  బాగా వేయించాలి. చికెన్ పచ్చడికి ఎలా అయితే వేయిస్తారో, అదే విధంగా వేయించడం ముఖ్యం, అప్పుడే చికెన్ కారంపొడి నిల్వ ఉంటుంది. వేయించిన చికెన్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే నూనెలో రెండు టేబుల్ స్పూన్ల తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి, పచ్చి వాసన పోయి, దోరగా అయ్యేవరకు వేయించి, పక్కకు తీసి చల్లారనివ్వాలి.

4 / 5
వేయించిన మసాలా దినుసులు, చికెన్ , వెల్లుల్లిపాయలు అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండింగ్ ప్రారంభించాలి. మొదట వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్‌లో వేయండి. రుచికి తగినంత ఉప్పు, పావు టీస్పూన్ ఇంగువ, కొద్దిగా చింతపండు ముక్క వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి, ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. తర్వాత, వేయించిన చికెన్ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి పొడిపొడిగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత అది పొడిపొడిగా వస్తుంది. కొంత చికెన్‌ను పక్కకు తీసి, మిగిలిన చికెన్‌లో వేయించిన వెల్లుల్లిని కలిపి మళ్ళీ బ్లెండ్ చేయాలి, ఇది బాగా మిక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. చివరగా, గ్రైండ్ చేసిన మసాలా పొడి, చికెన్ పొడి, వెల్లుల్లితో కలిపిన చికెన్‌ను ఒక పెద్ద పళ్ళెంలో వేసి బాగా కలపాలి. ఈ దశలో ఉప్పు సరిచూసుకుని, అవసరమైతే సర్దుబాటు చేసుకోవచ్చు.

5 / 5
చికెన్ వేయించిన మిగిలిన నూనెను ఉపయోగించి తాలింపు పెట్టాలి. పాన్‌ను స్టవ్ మీద పెట్టి వేడి చేసి, నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దంచిన వెల్లుల్లి, రెండు రెమ్మల కరివేపాకు వేసి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు చిన్న మంట మీద వేయించి స్టవ్ ఆపివేయండి. పాన్‌ను పక్కకు దించి, ఈ వేడి తాలింపులో సిద్ధం చేసుకున్న చికెన్ కారంపొడిని వేసి బాగా కలపాలి. అంతే దగ్గు జలుబుకు చెక్ పెట్టే చికెన్ కారం పొడి రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us