Natural Hair Dye: ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌ పెట్టండి!

Updated on: Feb 23, 2026 | 7:30 PM

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. వాటిలో తెల్ల జుట్టు, జుట్టు రాలడం కూడా ఒకటి. ఇది ప్రతి 10లో 8 మందిలో కనిపించే ప్రధాన సమస్య. ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు జనాలు ఖరీదైన హెయిర్‌ డైలు వాడుతూ ఉంటారు. కానీ ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో సహజంగా జుట్టును నల్లగా మార్చుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి సహజంగా తెల్లజుట్టుకు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఈ మధ్య కాలంలో చాలా మందిలో చిన్న వయసులోనే జుట్టు నెరవడం కనిపిస్తోంది. ఇది చాలా పెద్ద తలనొప్పి తెప్పించే సమస్య. ఇలా జుట్లులో కాస్తా తెల్ల వెంట్రుకలు కనిపిస్తే చాలు జనాలు వెంటనే షాప్‌కు వెళ్లి హెయిర్ కలర్ వేయించుకుంటారు. కానీ వీటిలోని రసాయనాలు కొన్ని సార్లు మీ జుట్టుకు హాని చేయవచ్చు. కాబట్టి మీరు ఇంట్లో సహజంగా హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

2 / 5
రసాయనాలు లేని హెయిర్ డై తయారికి కావాల్సిన పదార్థాలు: ఉసిరి పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు, టీ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు, బీట్రూట్ - సగం, కలబంద - ఒక చిన్న ముక్క, పానికం ఆకులు - 3-4,  నీరు - 1.75 గ్లాసులు.

3 / 5
తయారీ విధానం: ఈ హెయిర్ డై తయారు చేసుకునేందుకు ముందుగా ఒక గిన్నెలో పావు గ్లాసు నీళ్లు తీసుకుని, టీ పొడి, కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, ముప్పావు గ్లాసు పక్కన పెట్టుకోవాలి. తర్వాత, ముందుగా తయారుచేసిన బ్లాక్ టీలో తొక్క తీసిన బీట్‌రూట్ ముక్కలు, కలబంద జెల్, పానికం ఆకులు వేసి పేస్ట్ లా రుబ్బుకోవాలి.

4 / 5
తర్వాత ఉసిరి పొడిని లో ప్లేమ్‌లో ఒక పాన్‌పై వేయించి. పొడి ముదురు గోధుమ రంగులోకి లేదా కాఫీ పొడి రంగులోకి వచ్చే వరకు ఉంచి మంటను ఆపివేయండి. తరువాత వేడి గూస్బెర్రీ పొడిలో తురిమిన బీట్ రూట్ వేసి బాగా కలపాలి.

5 / 5
వీటిని ఓవెన్‌లో తక్కువ వేడి మీద వేడి చేసి మందపాటి పేస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది వేడెక్కుతున్న కొద్దీ, ఇది మంచి నల్ల రంగులోకి మారుతుంది. అది చల్లారిన తర్వాత దానిని హెయిర్‌కు అప్లై చేసుకొని కాసేపు ఉంచి కడిగేయండి. ఈ హెయిర్ డైని రష్మీస్ కర్రీ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసింది. కావాలంటే మీరు దీనిపై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు. ( note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగామాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించట్లేదు.

Follow Us