కొత్తిమీరను ఇంట్లోనే ఇలా పెంచితే.. డబ్బు ఆదా చేయడమే కాదు.. సంపాదించొచ్చు కూడా!

Updated on: Sep 28, 2026 | 5:58 PM

కొత్తిమీర.. చాలా మంది దీన్ని వంటల్లో వాడే ఆకుకూరగా మాత్రమే చూస్తారు. కానీ దీన్ని సరైన విధానంగా వాడుకుంటే.. ఇది మనకు ఆదాయ వనరుగా కూడా మారుతుంది. అవును చాలా మంది ఇంట్లోకి కావాల్సిన కొత్తిమీరను మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు తెలిస్తే.. ఇంట్లోనే మీరు తాజా కొత్తి మీరను పండించుకోవచ్చు. దీని వల్ల ఇంట్లోకి తాజా కొత్తమీరతో పాటు మార్కెట్‌లో దీన్ని అమ్మీ మీరు డబ్బు కూడా సంపాధించవచ్చు. కాబట్టి ఇంట్లోనే ఈజీగా కొత్తిమీరను ఎలా పెంచాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
మీరు ఇంట్లో కొత్తిమీర పెంచడానికి పెద్దగా కష్టపడాల్నిన పనిలేదు.. మీ బాల్కనీ కొద్ది ప్లేస్ ఉంటే సరిపోతుంది. ముందుగా మీరు మార్కెట్‌కు వెళ్లి ఓ మంచి వెడల్పాటి కుండీలు తెచ్చుకోవాలి. కుండీలు దొరక్కపోతే.. ఇంట్లో పనికిరాని వెడల్పాటీ పాత్రలు, లేదా గ్రో బ్యాగ్స్‌లో కూడా మీరు దీన్ని పెంచవచ్చు. మీరో విషయం.. మీ కొనే కుండీలకు చిన్న చిన్న రంద్రాలు చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వాటర్ ఎక్కువైనప్పుడూ వాటి ద్వారా బయటకి వెళ్లిపోతాయి.

2 / 5
కుండీలు రెడీ చేసుకున్న తర్వాత కొత్తిమీర మంచిగా పెరగడానికి కావాల్సిన ఎర్ర మట్టి, కోకో పిట్, వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువును సమన భాగాల్లో కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉండే కొన్ని దనియాల తీసుకొని వాటిని పూర్తి కాకుండా రెండుగా పగిలేలా మెల్లగా దంచాలి. ఆ తర్వాత వాటిని 6 నుండి 8 గంటల పాటు నీటిలో నానబెడితే విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి.

3 / 5
తర్వాత కుండిలోని మట్టి మిశ్రమంపై నానబెట్టిన విత్తనాలను సమానంగా చల్లాలి. తర్వాత దానిపై అర అంగుళం మందంతో కోకో పిట్ లేదా మట్టిని కప్పి, నీటిని స్ర్రే చేయాలి.ఈ ప్రక్రియ తర్వాత విత్తనాలు వేసిన కుండీని తక్కువ సూర్యరశ్మి తలిగే ప్రాంతంలో రోజూ 4 నుండి 5 గంటల పాటు ఉంచాలి. మరో విషయం మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా మార్నింగ్, ఈవినింగ్ వాటర్ స్ర్రే చేయడం మర్చిపోవద్దు. అలా అన్ని ఎక్కువ నీరు పోయకండి.

4 / 5
ఇలా మీరు విత్తనాలు నాటిన 7 నుంచి 10 రోజుల్లో కుండీలో మొలకలు రావడం కనిపిస్తాయి. ఇవి జస్ట్ 30 నుండి 35 రోజుల్లో పెద్దగా పెరిగి.. కొత్తిమీర కోసుకునేందుకు వీలుగా మారుతుంది. ఒక వేళ కొత్తిమీరకు తెగుళ్లు వస్తే కాస్త వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేయండి. తెగుళ్లు పోయిన తర్వాత మొక్కలను వేర్ల నుంచి పీకకుండా నేల నుండి 1 అంగుళం పైన కత్తెరతో కత్తిరిస్తే, అదే మొక్క మళ్లీ పెరుగుతుంది.

5 / 5
ఇలా కాసిన కొత్తి మీరను కోసుకొని మీరు ఇంట్లో అవసరాలకు వాడుకోవచ్చు. మీకు ఇంట్లో ఎక్కువైపోతే.. మిగిలిన కొత్తిమీరను మార్కెట్‌లో వెళ్లి అమ్మవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు  కొత్తిమీరను బయట కొనే ఖర్చు తగ్గడంతో పాటు మీకే అదనంగా డబ్బులు వస్తాయి. దీన్ని మీరు పార్ట్‌టైం ఇన్‌కమ్‌గా మార్చుకోవచ్చు.. తక్కువ పెట్టుబడితో, తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు తెచ్చే ఒక అద్భుతమైన చిన్న తరహా వ్యాపారంగా ఇది ఎంతో మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us