Heritage Saree Walk: 6000 మంది మహిళలు.. అందరూ చీరలు ధరించి ఏం చేశారో తెలుసా..!?

| Edited By: Shiva Prajapati

Aug 06, 2023 | 11:44 PM

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి గొప్పతనం పెంచుకో.. సింగారం అనే దారంతో చేసింది చీర.. ఆనందం అనే రంగులనే అద్దింది.. మమకారం అనే మగ్గం పై నేసింది చీర’ సినీ పాటల చంద్రబోస్ రాసిన ఈ లిరిక్స్ కు అద్దం పడుతూ ఈ ఉషోదయ వేల బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించే ఆర్‌కే‌బీచ్ ఈ ఉదయం మరింత మెరుగైన స్వర్ణ కాంతులనీనింది.

1 / 8

2 / 8
సంప్రదాయ కట్టు, బొట్టుతో దాదాపు 6 వేల మంది మహిళలు విశాఖ బీచ్ రోడ్‌లో చేసిన హెరిటేజ్ శారీ వాక్‌తో ఆ పరిసర ప్రాంతాలు మురిసిపోయాయి. మహిళల అందాలకు మరింత వన్నె అద్దెలా కష్టపడి నేత నేస్తున్న వారిని ప్రమోట్ చేయాలంటూ శారీ వాక్‌లో పాల్గొన్న 6 వేల మంది మహిళలు నినదించడం అచ్చేరువొందించింది.

3 / 8
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సంస్థ అధ్వర్యంలో జరిగిన ఈ వాక్ కు ముఖ్య అతిధులుగా కరణం మల్లీశ్వరి, మేయర్ హరికుమారి, ఉష శ్రీ, డాక్టర్ పద్మశ్రీ లు హాజరయ్యారు

4 / 8
మూడు లక్ష్యాలతో ఈ వాక్ నిర్వహించినట్లు జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, విశాఖ కార్పొరేటర్ ఉష శ్రీ తెలిపారు. 1. పాశ్చాత్య దుస్తులను అమితంగా ప్రేమించే యువతులలో చీర కట్టు పట్ల ఆసక్తిని పెంచండం, ప్రోత్సహించడం. 2. కోవిడ్ కారణంగా చితికి పోయిన చేనేత జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాలంటే  హాండ్ లూం శారీ లను ప్రోత్సహించడం. 3. చీరలో నడవడం కష్టమనుకునే వాళ్లకు ఈ 30 నిమిషాల వాక్ ద్వారా వాళ్ళ ఫిట్నెస్ ను పెంపొందించే విధంగా ప్రోత్సహించడం.

5 / 8
ఇవన్నీ సోమవారం ఆగష్టు 7వ తేదీన నేషనల్ హ్యాండ్లూమ్ డే ను పురస్కరించుకుని విశాఖలో తామిచ్చిన పిలుపుకు స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఉష శ్రీ తెలిపారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరువేల మంది ఈ వాక్‌‌లో పాల్గొనడం విశాఖ మహిళల దృఢ చిత్తాన్ని, సవాళ్ళను ఎదుర్కొనే స్వీకరించే తీరును తెలియచేసింది.

6 / 8
లండన్‌లో జరిగిన మారథాన్‌లో సంబల్పూర్ శారీతో 42 కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొన్న మధు స్మితా దాస్ నే ఈ వాక్‌కు స్ఫూర్తి అని ఉషశ్రీ తెలిపారు. ఇలాంటి మారథాన్ గతంలో సూరత్‌లోనూ జరిగిందని గుర్తు చేశారు.

7 / 8
ఆంధ్రా, తెలంగాణ లలో ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చ జరిగితే విశాఖ మహిళల సత్తా చూపాలన్న లక్ష్యం తోనే ఈరోజు బీచ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు

8 / 8
ప్రపంచ వస్త్రధారణలో చీర స్థానం ఎప్పటికీ పై మెట్టే.  ప్రపంచానికి చీర అందం పరిచయం చేసిన ఘనతమన దేశానిదే. అలాంటి చీరకట్టు నేడు అంతరించి పోతున్నది.  అందుకే ఆ చీరకట్టు ప్రాధాన్యతపై అవగాహన కల్పించి, మన సంస్కృతిని కాపాడడం, దానిపై ఆధారపడ్డ చేనేత కుటుంబాలను ఆడుకోవడం లాంటి మహోన్నత లక్ష్యాలను భుజాన వేసుకుని విశాఖ మహిళలు చేసిన ఈ ప్రయత్నం దిగ్విజయం సాధించడం పట్ల అందరిలో ఆనందాన్ని నింపింది.