పాఠశాలకు వెళ్లేందుకు స్కూటీ తీసేందుకు వెళ్లిన టీచర్, స్కూటీ ముందు భాగంలో పక్షి గూడును చూసిన టీచర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా హొన్నాలి పట్టణంలో చోటు చేసుకుంది.
దావణగెరె జిల్లా హొన్నాలి పట్టణానికి చెందిన అనితా యోగేష్ అనే విద్యార్థిని స్కూటీలో ఓ పక్షి గూడు కట్టుకుంది.
టీచర్ అనితా యోగేష్‌తో కలిసి స్థానికులు ఆ పక్షి గూడు, గుడ్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
స్కూటీ ముందు పాకెట్‌లాంటి భాగంలో పక్షి గూడు కనిపించింది. అందులో ఒక గుడ్డు కూడా ఉంది. కానీ, కానీ పక్షి మాత్రం కనిపించలేదు.
పక్షులు సాధారణంగా ఇంటి పగుళ్లలో, చెట్లలో తమ గూళ్ళను నిర్మిస్తాయి. కానీ, ఇలా నిరంతరం ప్రయాణిస్తూ ఉండే స్కూటీలో పక్షి గూడు కట్టుకోవడం చాలా అరుదు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.