
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి , ఒక కప్పు మెంతికూర , రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం పొడి , అర టీ స్పూన్ నువ్వులు , తగినన్ని నీరు కూడా తీసుకోవాలి

గోధుమ పిండి, మెంతి కూర బిస్కెట్స్ తయారీ విధానం: ముందుగా మెంతికూరను కూరను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి

గోధుమ పిండి, మెంతి కూర బిస్కెట్స్ స్టెప్ - 1: ఇప్పుడు దీనిలో తరిమిన మెంతికూర, ఇంకా దీనిలో నెయ్యి లేదా వెన్నె వేసి చేత్తోతోనే మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని ఇలాగే 10 నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని తీసుకుని బిస్కెట్ లాగా చేసుకోవాలి.

గోధుమ పిండి, మెంతి కూర బిస్కెట్స్ స్టెప్ - 2 : ఇంకా మీ ఇంట్లో ఓవెన్ ఉంటే 180°C వద్ద 15-20 నిమిషాలు బేక్ చేయాలి. ఇంకా ఈ ఓవెన్ లేకపోతే పాన్‌లో మీడియం మంటపై రెండు వైపులా కాల్చుకోవాలి. ఇంకా ఈ బిస్కెట్లు గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత బయటకు తీసి దీనిని చల్లారనివ్వాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే కనీసం 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా కొంచెం కసూరి మెంతి, మిరియాల పొడి దీనిలో కలిపితే ఈ బిస్కెట్లకు మంచి రుచి, వాసన వస్తుంది. ఇంకా వీటిని సాయంత్రం టీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి పిల్లలకు పెడితే బయట జంక్ ఫుడ్ జోలికే వెళ్లరు.