
దాదాపు అన్ని ఇళ్లలో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర వంటలకు ప్రత్యేక రుచిని తీసుకువస్తుంది. ఇక కొత్తిమీర నుంచి వచ్చే ధనియాలు గురించి కూడా తెలియని వారుండరు.

ధనియాలు కూడా సుగంధ ద్రవ్యాలే. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి ధనియాల నీళ్లు భలేగా ఉపయోగపడతాయి.

కొత్తిమీరలో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అనేక సూక్ష్మపోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కొత్తిమీర శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

నేటి కాలంలో చాలా మందికి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. మీరూ గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్ధకంతో బాధపడుతుంటే రోజుకు ఒకసారి ధనియాల నీటిని తాగడం మర్చిపోవద్దు.

ధనియాల నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ధనియాలు మంచి ఔషధంగా పని చేస్తాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.