మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు బెస్ట్.. ఓట్స్ ఇడ్లీ ఎలా చేయాలంటే?

Updated on: Nov 08, 2026 | 10:04 AM

మార్నింగ్ టిఫిన్ చేయడం ఆరోగ్యానికి మంచిది. అందుకే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఇడ్లీ తినాలి అనుకుంటారు. అయితే ఎప్పుడూ తినే విధంగా కాకుండా, కాస్త కొత్తగా, హెల్దీగా ఓట్స్‌తో ఇడ్లీ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. చాలా సులభంగా రుచికరమైన ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చునంట.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఓట్స్ ఒక కప్పు, బొంబాయి రవ్వ కప్పున్నర, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఉల్లి కాడలు, ఉప్పు, పచ్చి మిర్చి, పచ్చి బఠానీ, అల్లం ముక్కలు, పెరుగు, వంట సోడా, నెయ్యి, జీడిపప్పు.

2 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఒక కప్పు ఓట్స్‌ను తీసుకుని, స్టవ్ ఆన్ చేసి పాన్‌లో  వేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించాలి. ఓట్స్ బాగా వేడి అయిన తర్వాత వాటిని మరొక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మళ్లీ అదే పాన్‌లోకి అర కప్పు బొంబాయి రవ్వను  తీసుకుని, రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించాలి. రవ్వను వేయించడం వలన ఇడ్లీ రుచి మెరుగుపడుతుంది. వేయించిన రవ్వను కూడా ఓట్స్ వలె ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

3 / 5
 వేయించి చల్లార్చిన ఓట్స్‌ను మిక్సర్ జార్‌లోకి తీసుకుని, మరీ మెత్తని పిండిలా కాకుండా, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.  గ్రైండ్ చేసిన ఓట్స్ పొడిని, వేయించి చల్లార్చిన బొంబాయి రవ్వను ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో అర కప్పు పెరుగును చేర్చి బాగా కలపాలి. అవసరానికి తగినట్లుగా నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బొంబాయి రవ్వ నీటిని పీల్చుకుంటుంది కాబట్టి, ఈ పిండిని 15 నిమిషాల పాటు నానబెట్టడం ముఖ్యం. ఇది రవ్వకు నీటిని పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది.

4 / 5
 15 నిమిషాల తర్వాత, పిండి కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ పిండికి సరిపడా నీళ్లను మళ్లీ కొద్దిగా కలుపుకుని, పిండిని సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. రుచికి సరిపడా ఉప్పును, అర టీస్పూన్ నుండి ముప్పావు టీస్పూన్ వరకు వంట సోడాను లేదా ఈనో ప్యాకెట్‌ను కలపాలి.  మీరు ప్లెయిన్ ఇడ్లీలను ఇష్టపడితే, ఇప్పుడు నేరుగా ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు. అయితే, వెజిటబుల్ ఇడ్లీల కోసం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అర టీస్పూన్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర ఆకును పిండిలో కలపండి. బీన్స్, పచ్చిబఠానీలను కూడా కొద్దిగా క్రష్ చేసి వేసుకోవచ్చు. ఇలా కూరగాయలు కలపడం వల్ల ఇడ్లీలు మరింత ఆరోగ్యకరంగా మారతాయి.

5 / 5
ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి రాయాలి. కావాలంటే ఒక్కో జీడిపప్పు పలుకును మధ్యలో ఉంచవచ్చు. ఇప్పుడు తయారుచేసిన ఇడ్లీ పిండిని ప్లేట్లలో పోయాలి.ఇడ్లీ బౌల్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. నీళ్లు వేడెక్కాక ఇడ్లీ ప్లేట్లను పెట్టి, 10-12 నిమిషాల పాటు మీడియం మంటపై ఆవిరిపై ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ ఓట్స్ ఇడ్లీలు రెడీ. మరి మీరు కూడా ట్రై చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us