
హెల్తీ పాల స్వీట్ కు కావాల్సిన పదార్దాలు: ఒక లీటర్ పాలు, పావు కిలో బెల్లం పొడి తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి టేబుల్ స్పూన్లు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా 10 డ్రైఫ్రూట్స్ , 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు తీసుకోవాలి. ఇంకా దీనిలో పంచదార కంటే బెల్లం వాడితే ఇంకా మంచిది. ఎందుకంటే, ఇది ఆరోగ్యంగా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

పాలను ఈ విధంగా మరగబెట్టుకోవాలి : ముందుగా పాలను తీసుకుని ఒక పాత్రలో పోసి మీడియం మంట మీద కలుపుతూ వాటిని బాగా మరిగించాలి. ఇలా చేస్తే పాలు సగం వరకు తగ్గుతాయి. ఇది స్వీట్‌కు మంచిగా ఉంటుంది. అయితే, మరి గట్టిగా అస్సలు ఉండకూడదు. ఇలా అయితే ఎక్కువ రోజులు ఉండదు.కాబట్టి, ఇక్కడ కొంచం జాగ్రత్తగా ఉండాలి

మరిగిన పాలలో బెల్లాన్ని ఇలా కలుపుకోవాలి: పాలు గట్టిగా అయినా తర్వాత దానిలో బెల్లం పొడి వేసి ఒక చిన్న గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇంకా బెల్లం మొత్తం కరిగి చిక్కగా మారే వరకు దానిని బాగా ఉడికించాలి. ఈ సమయంలోనే ఇది స్వీట్ లాగా మారుతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీరు ఇంట్లో చేసేటప్పుడు ఇలాగే చేయండి.

నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది: ఇప్పుడు మళ్లీ ఇంకో పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి చేసి అది వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి ఈ మిశ్రమంలో కలపాలి. అలాగే, దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇలా వేస్తే సువాసన వస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేసే టప్పుడు కూడా ఇలాగే చేసుకోండి.

ఈ పాల స్వీట్ మిశ్రమాన్ని తీసుకుని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి దానిని సమంగా చేయాలి. అయితే దీనిని కనీసం 10 నిముషాలు పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కావాలంటే మీరు వీటిని చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా పెంచుతుంది.