
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బాగా పండిన అరటి పండ్లు రెండు పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే పంచదార, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్, నెయ్యి రెండు టేబుల్స్ స్పూన్స్.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్క తీసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. మనం సగానికి కట్ చేసిన వాటిని మళ్లీ నిలువుగా రెండుగా కట్ చేయాలి.

ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని వేడి చేయాలి. తర్వాత అరటి ముక్కలను తీసుకోవాలి. వాటిని పాన్ పై ఒకదాని పక్కన మరొక పేర్చాలి. సన్ననిమంటపై దాదాపు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు ఆ అరటి పండ్లపై కొంచెం కొంచెం పంచదారను చల్లుతూ ఉండాలి. తర్వాత వీటిని మళ్లీ కలపాలి, తర్వాత మరో ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకోవాలి. అరటి పండ్లు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి.

తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక వీటి వేడి తగ్గిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్‌లోకి వేయాలి. లేదా సర్వ్ చేయవచ్చును. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పెడితే చాలు మళ్లీ మళ్లీ కావాలి అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి.