Ice Cream : హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా ఐస్‌క్రీమ్ తినాలనుందా?.. ఇంట్లోనే సూపర్ టేస్ట్‌గా ఇలా చేసుకోండి!

Updated on: Apr 01, 2026 | 3:08 PM

సమ్మర్ వచ్చిందంటే చాలూ.. సీతల పానియాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఎందేకంటే ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లగా ఏదైనా తిందామని, తాగుదామని జనాలు అనుకుంటారు. ఇక ఈ ఎండ నుంచి మనకు ఉపశమనం కలిగించే స్వీట్‌ ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఐస్‌క్రీమ్ మాత్రమే. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో జరుగుతున్న కల్తీ భయందో బయట తినాంటే చాలా మంది భయపడుతున్నారు. అలాంటి వారికి ఇంట్లోనే టేస్టే టేస్టీ ఐస్‌క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మేం చెప్పబోతున్నాం. అదెలానో చూద్దాం పదండి.

1 / 5
వేసవి తాపాన్ని తగ్గించుకుంటూనే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి 'నో షుగర్ ఐస్‌క్రీమ్' ఒక అద్భుతమైన ఎంపిక. బయట దొరికే ఐస్‌క్రీముల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంట్లోనే సహజమైన తీపితో చేసుకునే ఈ ఐస్‌క్రీములు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో మీరు గిల్ట్-ఫ్రీగా ఎంజాయ్ చేయగల కొన్ని హెల్తీ ఐస్‌క్రీమ్ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి అవేంటి వాటిని సింపుల్‌గా ఇంటల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

2 / 5
బనానా ఐస్‌క్రీమ్: ఇది చాలా క్రీమీగా, తక్కువ సమయంలో చేసుకోదగ్గ బెస్ట్ ఐస్‌క్రీమ్. ఈ ఐస్‌క్రీమ్ తయారు చేసుకునేందుకు మీకు  2 బాగా పండిన అరటిపండ్లు, 1/2 కప్పు పాలు (లేదా బాదం పాలు), 1/2 టీస్పూన్ వెనిల్లా అవసరం. ముందుగా అరటిపండ్లను ముక్కలుగా కోసి 4 నుండి 5 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. ఆ తర్వాత వాటిని బ్లెండర్‌లో వేసి పాలు, వెనిల్లా ఎసెన్స్ కలిపి మెత్తగా (స్మూత్ పేస్ట్‌లా) అయ్యే వరకు బ్లెండ్ చేయండి. దీన్ని మరో గంట సేపు ఫ్రీజ్ చేసి సర్వ్ చేయండి. అంతే మీ బనానా ఐస్‌క్రీమ్ రెడీ.

3 / 5
మ్యాంగో పెరుగు ఐస్‌క్రీమ్: మామిడి పండ్ల సీజన్‌లో ఇది బెస్ట్ డెజర్ట్ అని చెప్పవచ్చు. ఈ ఐస్‌క్రీమ్ తయారీకి 1 కప్పు మామిడి పండు గుజ్జు, 1/2 కప్పు గడ్డ పెరుగు, 1 లేదా 2 ఖర్జూరాలు అవసరం. ఇది తయారు చేసేందుకు ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్ జార్‌లో వేసి బాగా బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్ ట్రేలో లేదా కుల్ఫీ మోల్డ్స్‌లో పోసి 5 నుండి 6 గంటల పాటు ఫ్రీజ్ ఉంచండి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే మీ మ్యాంగో ఐస్‌క్రీమ్ రెడీ.

4 / 5
చాక్లెట్ పీనట్ బటర్ ఐస్‌క్రీమ్: ఇది పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్. దీని తయారికి 2 ఫ్రోజన్ అరటిపండ్లు (ఫ్రీజ్ చేసినవి), 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్, 1 టీస్పూన్ కోకో పౌడర్ సరిపోతుంది.  ఇది తయారు చేసేందుకు.. ఈ మూడు పదార్థాలను బ్లెండర్‌లో వేసి క్రీమీగా అయ్యే వరకు మిక్స్ చేయండి. దీన్ని అప్పటికప్పుడే తినవచ్చు లేదా కాసేపు ఫ్రీజ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.

5 / 5
స్ట్రాబెర్రీ కోకోనట్ ఐస్‌క్రీమ్:  కొబ్బరి పాలతో చేసే ఐస్‌క్రీమ్ మీకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు 1 కప్పు తాజా లేదా ఫ్రోజన్ స్ట్రాబెర్రీలు, 1/2 కప్పు కొబ్బరి పాలు, 2 నుండి 3 ఖర్జూరాలు అయితే సరిపోతుంది. ఇక దీన్ని తయారు చేసేందుకు స్ట్రాబెర్రీలను ముందుగా ముక్కలు చేసి 2-3 గంటలు ఫ్రీజ్‌లో ఉంచాలి. తర్వాత స్ట్రాబెర్రీలు, కొబ్బరి పాలు, ఖర్జూరాలను బ్లెండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లో వేసి 4 నుండి 5 గంటలు ఫ్రీజ్‌లో ఉంచితే రుచికరమైన ఐస్‌క్రీమ్ రెడీ.

Follow Us