Cardamom Water Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల వాటర్ తాగితే…దిమ్మతిరిగే అద్భుతాలు..!

|

Jan 10, 2025 | 7:02 AM

ఇటీవలి కాలంలో చాలా మంది డీటాక్స్‌ వాటర్‌ను అలవాటుగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కీరదోస, మెంతుల నీరు, జిలకర్ర, సోంపు వాటర్‌ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, యాలకుల వాటర్‌ కూడా మంచి డీటాక్స్‌ డ్రింక్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి చూద్దాం..

1 / 6
యాలకులు..ప్రతి వంటింట్లోను తప్పక ఉండే ఒక ముఖ్యమైన మసాలా దినుసు..దీని ఉపయోగాలు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. సాధారణంగా మనం యాలకులను ఆయా వంటకాలకు మంచి ఫ్లేవర్ కోసం.. సువాసన కోసం వినియోగిస్తుంటాం. అయితే, ఈ యాలకులు మన ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది.

2 / 6
రెండు పచ్చి ఏలకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఉదయం కాఫీ లేదా టీకి బదులుగా ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గుండెల్లో మంట, అజీర్ణం నివారిస్తుంది.

3 / 6
పచ్చి ఏలకుల నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇది బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటిని రిఫ్రెష్ చేస్తుంది. అంతేకాదు..ఉదయం ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్, అదనపు నీటిని బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

4 / 6
యాలకులలోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

5 / 6
మీరు బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఖాళీ కడపుతో యాలకుల నీరు తాగడం మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం మెరుగై, అదనపు క్యాలరీలను కరిగించి, త్వరగా శరీర బరువులో మంచి మార్పు వస్తుంది.

6 / 6
ఆకుపచ్చ యాలకులు ఫైబర్, ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.