Hair Color Stain Removing Tips: ఇలా చేస్తే.. హెయిర్ డై వేసేటప్పుడు చర్మంపై అంటుకున్న మరకలు సులభంగా తొలగిపోతాయి!

|

Mar 05, 2024 | 8:52 PM

నెరిసిన వెంట్రుకలను కప్పిపుచ్చుకోవడానికి నెలనెలా జుట్టుకు రంగు వేసేవారు మనలో చాలా మంది ఉన్నారు. మార్కెట్‌లో చాలా ఇన్‌స్టంట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సులభంగా జుట్టుకు రంగు వేయడానికి ఉపయోగించవచ్చు. కానీ ఒక్కోసారి చర్మం ఇతర ప్రదేశాల్లో ఈ కలర్‌ మరకలు అంటుకు పోతాయి. హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు చాలా సార్లు ఆ రంగు నుదుటిపైన, మెడపై అంటుకుంటుంది..

1 / 5
నెరిసిన వెంట్రుకలను కప్పిపుచ్చుకోవడానికి నెలనెలా జుట్టుకు రంగు వేసేవారు మనలో చాలా మంది ఉన్నారు. మార్కెట్‌లో చాలా ఇన్‌స్టంట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సులభంగా జుట్టుకు రంగు వేయడానికి ఉపయోగించవచ్చు. కానీ ఒక్కోసారి చర్మం ఇతర ప్రదేశాల్లో ఈ కలర్‌ మరకలు అంటుకు పోతాయి. హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు చాలా సార్లు ఆ రంగు నుదుటిపైన, మెడపై అంటుకుంటుంది.

2 / 5
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, జుట్టుకు రంగు వస్తుంది. కానీ చర్మానికి అంటుకున్న రంగు పోదు. ఇలాంటి సందర్బాల్లో రంగు మరక వదిలించుకోవడానికి ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. చర్మానికి అంటుకున్న హెయిర్ డైని తొలగించడానికి టూత్ బ్రషింగ్ ఉపయోగించాలి. పాత బ్రష్‌పై టూత్‌పేస్ట్ వేసి, ఆ పేస్ట్‌ని మరక ఉన్న చోట అప్లై చేసి రుద్దితే సరి. ఈ ట్రిక్ ను రెండు మూడు సార్లు పాటిస్తే చర్మంపై జుట్టు రంగు ఇట్టే తొలగిపోతుంది.

3 / 5
హెయిర్ కలర్ వేసుకునే ముందు చర్మంపై పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవాలి. ఇది రంగు పడినా అంటుకోకుండా చేస్తుంది. చర్మం రంగు మారినట్లయితే, ఆ భాగంలో పెట్రోలియం జెల్లీని రాసినా సులువుగా వదలిపోతుంది. పెట్రోలియం జెల్లీని అప్లై చేసి, దానిపై రుద్దడం వల్ల రంగు పోతుంది.

4 / 5
బేకింగ్ సోడాలో డిటర్జెంట్ పౌడర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై, మెడపై హెయిర్ కలర్ ఉన్న చోట రాసుకోవాలి. కాసేపు అలాగే ఉంచి రుద్దాలి. ఇది రంగును సులభంగా తొలగిస్తుంది. ఇంట్లో ఏదైనా ఆల్కహాల్ ఉంటే దానిని లిక్విడ్ సబ్బుతో కలిపి వాడినా ఫలితం ఉంటుంది. ఆల్కహాల్, సబ్బు మిశ్రమం చర్మం నుంచి జుట్టు రంగును తొలగిస్తుంది. అయితే మొటిమలు వచ్చే లేదా సెన్సిటివ్ స్కిన్ మీద ఈ ట్రిక్ అప్లై చేయకపోవడమే మంచిది.

5 / 5
చర్మం నుంచి హెయిర్‌ డై రంగును తొలగించడానికి మేకప్ రిమూవర్ ఉపయోగించవచ్చు. కాటన్ బాల్‌తో మేకప్ రిమూవర్ తీసుకుని.. చర్మంపై రుద్దాలి. ఇది జుట్టు రంగును సులభంగా తొలగిస్తుంది. మేకప్ రిమూవర్‌కి బదులుగా నెయిల్ రిమూవర్‌ని కూడా ఉపయోగించవచ్చు. మెడ, నుదుటిపై జుట్టు రంగు అంటుకున్న ప్రదేశాల్లో నెయిల్ రిమూవర్‌తో తొలగించుకోవచ్చు. ఇలా చేస్తే రంగు వెంటనే పోతుంది.