
జామపండు: జామపండును పోషకాల పవర్‌హౌస్ అని అంటారు. ఇందులో ఉండే విటమిన్ సి పరిమాణం నారింజ పండు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల జామలో 228 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

జామపండులో తక్కువ కేలరీలు, అధిక పీచు పదార్థం ఉండటం వల్ల, బరువు తగ్గాలనుకునే వారికి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల కొంతమందిలో మలబద్ధకం, గ్యాస్ ఏర్పడవచ్చు. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు పరిమిత పరిమాణంలో మాత్రమే అరటిపండ్లను తీసుకోవాలి. వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు.

ఏది ఎంచుకోవాలి? ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అంటే అది పూర్తిగా మీ ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు షుగర్ లేదా బరువు తగ్గడం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లయితే జామపండు ఉత్తమమైనది. అలా కాకుండా రోజంతా శారీరక శ్రమ చేసేవారు లేదా తక్షణమే అలసట నుండి ఉపశమనం పొందాలనుకునే వారు అరటిపండును ఎంచుకోవడం మంచిది. వాస్తవానికి శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలంటే ఒకరోజు జామ, మరొకరోజు అరటిపండు మార్చి మార్చి తీసుకోవడం అత్యుత్తమమైన పద్ధతి.

ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. పండ్లు మరీ పుల్లగా లేకుండా చూసుకోవాలి, లేదంటే ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తీసుకునేటప్పుడు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ జీవనశైలికి, శరీర తత్వానికి తగ్గట్టుగా సరైన పండును ఎంచుకుని మీ రోజును ఆరోగ్యంగా ప్రారంభించండి.