
రోజుకు ఒక ఆపిల్ పండు తింటే చాలు డాక్టర్ అవసరమే ఉండదు అనే సూక్తి తెలిసిందే. అయితే పండ్లు నిజానికి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంటాయి. ఇక చాలా మంది జామ పండ్లు తినడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని పేదోడి ఆపిల్ పండు అని అంటారు. ఇక ఈ రెండు పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిలో దేనిని తినడం చాలా ఆరోగ్యానికి చాలా మేలు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

భారత్‌లో జామకాయ పోషక విలువలు ఉన్న పండ్లలో ఒకటి. ఇక ఆపిల్ పండుతో పోల్చినప్పుడు వీటిలో చాలా తేడాలు ఉంటాయంట. చాలా మంది ఆపిల్స్ ఖరీదైనవి కాట్టి చాలా ఆరోగ్యకరం అనుకుంటారు. కానీ ఈ రెండు పండ్లలో పోషక విలువల్లో తేడాలు ఉన్నట్లు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు చెబుతున్నారు.

పోషక విలువల ప్రకారం చూసుకుంటే ఆపిల్ పండులో 52 కిలోల కేలరీలు, జామలో 68 ప్రోటీన్, ఆపిల్ 03, జామ 2.6, ఫైబర్ ఆపిల్ 2.4 జామలో 5.4, విటమిన్ సి ఆపిల్ 4.6 జామలో 228 మి. గ్రాములు, పొటాషియం ఆపిల్ 107 మి. గ్రా జామలో 417 మి. గ్రా, విటమిన్ ఎ 53ఐయూ జామలో 624 ఐయూ. అత్యధిక ఖరీదు పెట్టి కొనుగోలు చేసే ఆపిల్స్ కంటే జామలో విటమిన్ సీ చాలా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఒక జామ కాయ తినడం వలన రోజూవారీ అవసరంలో 200శాతం కంటే ఎక్కువ శక్తి అందించగలదు. అందువలన జామ పండు అత్యమ పండ్లలో ఒకటి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచడంలో ఆపిల్ పండు కంటే, జామక కాయ కీలకంగా ఉంటుంది. ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తినడం కంటే జామ కాయ తినడం వలన రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. అంతే కాకుండా ఆపిల్‌తో పోల్చినప్పుడు జామ పండు తినడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది. అందువలన డయాబెటీస్ రోగులు ఆపిల్ పండు కంటే జామ పండు తినడం చాలా మంచిది.

అంతే కాకుండా ఆపిల్ పండు కంటే జామ పండులో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. అందువలన అధిక రక్తపోటు తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆపిల్ కంటే జామ పండు మంచిది. అలాగే ఆపిల్స్‌లో క్వెర్సెటిన్, కాటెచిన్ పుష్కలంగా ఉంటాయి. రెండింటీలో ఇవి ఉన్నప్పటికీ ఆపిల్ పండులో ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన క్యాన్సర్ ఆస్తమా ఉన్నవారు ఆపిల్ తినడం మంచిది.