బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది.. సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే పూలు

Updated on: Sep 03, 2026 | 7:26 AM

బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, సీతమ్మ పువ్వు కోసం మహిళలు అందరూ వెతుకులాడుతుంటారు. బతుకమ్మను పేర్చే సమయంలో గునుగు పువ్వు, సీతమ్మ పువ్వే చాలా కీలకం. దీనిని కొన్ని ప్రదేశాలలో పట్టకుచ్చు పువ్వు అని కూడా అంటారు. ఇక బతుకమ్మ సమయంలో దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు బయట కొనుగోలు చేయడానికి కూడా దొరకదు. అందుకే చాలా మంది దీనిని పంట పొలాల్లో , ఇంటి వద్ద గార్డెన్‌లో ఎక్కువగా పెంచుకుంటారు.

1 / 5
అయితే కొన్ని సార్లు ఈ పువ్వు చెట్టు నిండుగా విరగబూస్తే మరికొన్నిసార్లు అస్సలు పువ్వే పూయదు, చిన్న మొగ్గలానే ఉండిపోతుంది. అయితే మీ ఇంటిలో ఉన్న సీతమ్మ పువ్వు కూడా ఎక్కువగా పూయడం లేదా. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం. సీతమ్మ పువ్వు చెట్టు నిండుగా విరగబూయాలి అంటే ఏం చేయాలో చూసేద్దాం.

2 / 5
సీతమ్మ పువ్వు నిండుగా పూయడమే కాకుండా చూస్తే తాజాగా ఉండాలి అంటే తప్పకుండా దానికి సూర్యరశ్మి చాలా అవసరం. అందువలన ఎప్పుడూ కూడా ఈ మొక్కలను నాటుకునే సమయంలోనే ఎండ బాగా తగిలే చోట నాటుకోవాలని చెబుతున్నారు నిపులు. అంతే కాకుండా మొక్క చిగురు గోటితో తుంచుతూ ఉండటం వలన కొత్త మొక్కలు వచ్చి, ఎక్కువగా పూలు పూస్తుందంట.

3 / 5
అలాగే దీనికి నీళ్లు కూడా ఎప్పుడూ పోస్తూ ఉండాలి. దీనికి నీళ్లు పోయడం వలన పువ్వు మంచి రంగుతో , తాజాగా ఉంటుంది. అయితే ప్రతి రోజూ కాకుండా, రెండు రోజులకు ఒకసారి వాటర్ పోయాలి. పండుగ సమయం దగ్గరిలో ఉన్న సమయంలో రోజుకు ఒకసారి సాయంత్రం సమయంలో నీళ్లు పోయాలి. దీని వలన పువ్వు పూర్తిగా వాడిపోకుండా తాజాగా ఉంటుంది.

4 / 5
ఇక సీతమ్మ పువ్వు బాగా, చెట్టు నిండుగా పూయాలి అంటే, తప్పకుండా దానికి  అరటి పండు తొక్కలను తీసుకొని వాటిని రెండు రోజు నానబెట్టి, మిక్సీ జార్‌లో  మిక్సీ పట్టి వాటిని నీటిలో కలిపి వారానికి ఒక సారి పోయాలి. దీని వలన పూలు పెద్దగా పూస్తాయి. మంచి రంగు కూడా వస్తుంది.

5 / 5
అంతే కాకుండా నెలకు ఒకసారి తప్పకుండా ఆవు పేడ, వేప పిండి మట్టిలో కలపాలి. మొక్క మొదలుకు కొద్ది దూరంలో ఈ మిశ్రమం వేయాలి. ఇలా చేయడం వలన మొక్క వేపుగా పెరిగి ఎక్కువ మొత్తంలో పూలను ఇస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us