పూల వెల్లువ.. ఈ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూస్తాయి!

Updated on: May 12, 2026 | 2:00 PM

మల్లెపూలు ఇష్టం లేని వారు ఎవరుంటారు. 100ల 90 శాతం మందికి మల్లెపూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది తమ ఇంటిలో తప్పకుండా మల్లె చెట్టును నాటుకుంటారు. ఇక సమ్మర్ వస్తే చాలు మల్లె చెట్టు గుబురుగా పూలు పూస్తుంది. అయితే ఈ మల్లెల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. అందులో తీగ మల్లె కూడా ఒకటి. ఇప్పటికీ పట్నం, పల్లెల్లో చాలా మంది ఇంటి ముందు తీగ మల్లె చెట్టు ఉంటుంది. అయితే ఈ తీగ మల్లె సమ్మర్‌లో బుట్టల కొద్ది పూలు పూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
Jasమగువలు ఇష్టపడే పూలలో మల్లెపూలే ముందుంటాయి. అంతే కాకుండా ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు ఎక్కువగా మల్లెపూలు పెట్టుకోవడానికే ఆసక్తి చూపుతారు. ఇవి పెట్టుకోవడం వలన అందం పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక సమ్మర్ వస్తే చాలు మల్లె  చెట్లు చెట్టు నిండా పూలతో అందంగా కనిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల తీగ మల్లె చెట్లు ఎక్కువగా పూలు పూయవు, అయితే అవి చెట్టు నిండా పూలు పూయాలి అంటే ఈ అద్భుతమైన చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే?

2 / 5
తీగ మల్లె చెట్టు చాలా వేపుగా పెరుగుతుంది. పందిరి పై పాకడం, ఇంటిపైకి వెళ్లి నిండుగా ఉంటుంది. అయితే మల్లెపూల సీజన్ ప్రారంభం కాగానే, ముందుగా తీగ మల్లె చెట్టు కొమ్మలు కట్ చేయాలంట. దీని వలన కొత్త కొమ్మలు వచ్చి, మొగ్గలు ఎక్కువగా వస్తాయి. దీని వలన చెట్టు నిండుగా పూలు  పూస్తాయంట. అందువలన తప్పకుండా చెట్టుకు కత్తిరింపులు జరపాలి అని చెబుతున్నారు మల్లె పూలు సాగు చేసే నిపుణులు.

3 / 5
అలాగే మల్లెపూలు విరగబూయాలి అంటే తప్పకుండా చెట్టుకు నీరును అందించాలి. ప్రతి రోజూ తప్పకుండా ఉదయం, సాయంత్రం తగినన్ని నీళ్లు పోయడం వలన చెట్టు ఆరోగ్యం, బలంగా ఉండి, బాగా మొగ్గలు పెట్టి ఎక్కువ పూలను ఇస్తుందంట. ఒక వేళ మీరు సాయంత్రం నీళ్లు పోస్తే ఉదయం బియ్యం కడిగిన నీరు పోయాలి అంట, మల్లె చెట్టు బాగా పూయడానికి అద్భుతమైన చిట్కా ఇది. బియ్యం నీళ్లు చెట్టుకు పోయడం వలన అది పోషకాలను గ్రహించి, ఎక్కువ పూలను ఇస్తుందంట.

4 / 5
చాలా మంది మల్లె మొక్కకు ఎక్కువగా ఎరువులు వేయరు. కానీ తీగ మల్లె చెట్టు మొదట ఆవు పేడ వేయడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. కనీసం వారానికి ఒకసారి చెట్టు వేరు మొదట ఆవు పేడ వేసి నీళ్లు పోయడం వలన మొక్క వేపుగా పెరుగుతుంది. అంతే కాకుండా కొమ్మ కొమ్మకు పూలనిస్తుదంట. అంతే కాకుండా మొక్క కూడా చాలా బలంగా ఉంటుంది.

5 / 5
ఇవే కాకుండా మల్లె పూలు బాగా పూయాలి అంటే టీ పొడి వేయడం, పంచదార వేయడం కూడా చాలా మంచిదంట. అంతే కాకుండా వరి గింజలు చెట్టు మొదట్లో వేయడం వలన కూడా చెట్టు బలంగా తయారు అవుతుంది ఎక్కువ పూలను ఇస్తుంది. అలాగే  పనికి రావని పారేసే అరటి తొక్కలు, ఆవాల పొడి, మజ్జిగ లాంటివి వేయడం వలన కూడా మల్లెపూల మొక్క ఎక్కువగా పూలను పూస్తుందంట.

Follow Us