
Mahindra Thar: లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ థార్ దేశంలోని ఏ కారుకు లేని విధంగా అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 226226mm. ఇది 18-అంగుళాల పెద్ద చక్రాలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, వర్టికల్ స్లాట్డ్ గ్రిల్ కలిగి ఉంది. థార్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది.

Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ 225ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇంజన్ విషయానికి వస్తే ఫార్చ్యూనర్ 2.7-లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ పవర్‌ను కలిగి ఉంది. ఫార్చ్యూనర్ టయోటా కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి.

Toyota Urban Cruiser Hyryder: ఈ టయోటా కారును మారుతి గ్రాండ్ విటారాతో పోలిస్తే 210ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌ని పొందుతుంది. గ్రాండ్ విటారా ధర రూ. 12.75 లక్షల నుండి రూ. 23.42 లక్షల వరకు ఉంది.

Maruti Grand Vitara: గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా, మారుతి 210ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ పొందింది. ఇది హోండా ఎలివేట్ ప్రవేశపెట్టే వరకు సెగ్మెంట్లో అత్యుత్తమంగా ఉంది.

Maruti Jimny: మారుతి జిమ్నీ 5-డోర్‌తో భారతదేశంలో ప్రారంభించబడింది. ఒక లైఫ్‌స్టైల్‌ని రూల్ చేసే SUV, జిమ్నీ 210mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. పర్వతాలకు వెళ్లేందుకు ఇది ఉత్తమ ఆప్షన్‌గా నిలుస్తోంది.