
బుడిమకాయ చెట్టుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బుడిమకాయలను వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వలన ఇవి అనేక రోగాల నుంచి మిమ్మల్ని కాపాడుతుందంట. అందుకే తాతముత్తాతల కాలంలో వారు, ఎక్కువగా దీనిని పప్పు కూరల్లో , వీటితో సాంబర్ చేసుకొని తినేవారంట. మరి కొంత మంది ఉదయం పూట జ్యూస్‌లా కూడా తీసుకునేవారంట. కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

బుడిమ కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువలన వీటిని మీరు ఆహారంలో చేర్చుకోవడం వలన చాలా సులభంగా బరువు తగ్గవచ్చును. ముఖ్యంగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది కడుపునిండిన భావనను కలిగిస్తుంది. అంతే కాకుండా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది బీపీ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే, బుడిమ కాయల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది హైబీపీ ఉన్నవారికి చాలా మంచిది.

అంతే కాకుండా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎవరు అయితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో ఎక్కువగా సతమతం అవుతుంటారో, అలాంటి వారు వీటిని తీసుకోవడం వలన అల్సర్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. అంతే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మరీ ముఖ్యంగా డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు కూడా దీనిని తినడం చాలా మంచిది. ఇది షుగర్ లెవల్స్ పై ఎలాంటి ప్రభావం చూపదు. అంతే కాకుండా కిడ్నీ సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా బుడమ కాయల రసాన్ని తలకు పట్టించడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట.

అంతే కాకుండా ఎవరు అయితే శరీరంలో అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారో, వారు వీటిని తమ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది. అయితే వీటిని తినే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా చేదు, మచ్చలు ఉన్నవాటిని అస్సలే తినకూడదు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.