Green Peas
యూరిక్ యాసిడ్: యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉండే ఒకరకమైన ద్రవం. శరీరంలో దీని స్థాయి పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పచ్చి బఠానీల్లో యూరిక్ యాసిడ్‌ను పెంచే అమినో యాసిడ్స్, విటమిన్ డి, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు ఉన్నవారు పచ్చి బఠానీలను తక్కువగా తినాలి.
అధిక బరువు: పచ్చి బఠానీలలో ప్రోటీన్, పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల బఠానీలను అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. రుచిగా ఉన్న కారణంగా అధికంగా తినేసి ఆరోగ్య సమస్యలకు గురికాకండి.
కిడ్నీ సమస్యలు: కిడ్నీ మన శరీరంలోని ముఖ్యమైన భాగం. శరీరం నుంచి వ్యర్థ, విష పదార్థాలను తొలగించడం దీని విధి. అయితే పచ్చిబఠానీ వంటి అధిక ప్రోటీన్‌ను కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గ్యాస్ట్రిక్ సమస్య: తరచుగా గ్యాస్ లేదా అసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి బఠానీలను తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. పచ్చి బఠానీలతో చేసిన కూరలను రాత్రిపూట తినడం మానేయాలి, ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.