
సేవింగ్స్ ఉద్యోగంలో ఉన్న సమయం నుంచే పదవీ విరమణ గురించి ఆలోచించే వారు ముందు నుంచే పొదుపు మంత్రం పాటిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎవరిపై ఆధారపడకుండా తమ పొదుపుపై వచ్చే వడ్డీతో జీవితాంతం హాయిగా బతకవచ్చు.

ఫ్రాంచైజీ తక్కువ ఖర్చుతో అధునాతనంగా ఆలోచించే వారు ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా నిపుణుల పర్యవేక్షణలో వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

మొక్కల నర్సరీ పెద్దగా పని చేయకుండా మొక్కల నర్సరీ పెట్టడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని నిపుణుల సూచన. అలాగే ఇది ఆదాయ మార్గంగా కూడా ఉపయోగపడుతుంది.

యూ ట్యూబ్ చానల్ ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో యూ ట్యూబ్ చానల్ పెట్టుకుంటే ఆదాయ మార్గంగా పని చేస్తుంది. కనీసం వంటల ఎలా చేయడమో నేర్పడం ద్వారా చానల్ క్లిక్ అయ్యితే అధిక ఆదాయం వస్తుంది.

అద్దెకు ఇవ్వడం మనకు ఉన్న ఇంటిని గానీ, కార్ లేదా స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. ఇలా చేయడం ద్వారా కష్టపడకుండానే ఆదాయం పొందవచ్చు. రిటైరయ్యాక వచ్చే సొమ్ముతో ఏదైనా ఇంటిని కొని దాన్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు.

వ్యక్తిగత కోచింగ్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి, అలాగే జీవితంలో ఏదైనా సాధిద్దామనుకునే వారికి వ్యక్తిగత కోచింగ్ ఇవ్వవచ్చు. జీవితంలో మనకు ఎదురైన సంఘటనలకు ఉదహరిస్తూ వ్యక్తిగత కోచింగ్ నిపుణుల్లా మారవచ్చు.