తట్టుకోలేని చలిలో తినాల్సిన బలమైన లడ్డూ.. ఇమ్యూనిటీని పెంచి ఎముకలు జాయింట్స్ ను గట్టిగా చేస్తుంది

Updated on: Nov 22, 2026 | 2:30 PM

శీతాకాలం మొదలు కాగానే చల్లని వాతావరణం, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలకు బలాన్ని చేకూర్చే ఒక అద్భుతమైన సంప్రదాయ వంటకం గోందు లడ్డూలు. రుచికరమైనవిగా ఉంటూనే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం..

1 / 5
గోందు అనేది కొన్ని ప్రత్యేకమైన చెట్ల నుండి లభించే సహజమైన జిగురు. దీనిని ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. గోందు లడ్డూల తయారీకి గోధుమపిండిని ప్రధానంగా వాడతారు. ముందుగా, ఒక కప్పు గోధుమపిండిలో ఒక స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోస్తూ పిండికి తడి తగిలేలా కలుపుకోవాలి. పిండి ముద్దగా మారకుండా పైపైన మాత్రమే కలిపి, 15 నిమిషాల పాటు మూతపెట్టి నానబెట్టాలి. నానిన పిండిని చేతితో పొడిపొడిగా చేసి జల్లెడ పట్టుకోవాలి. ఇలా చేస్తే పిండి రవ్వలా తయారవుతుంది.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి, పావు కప్పు గోందును కొద్ది కొద్దిగా వేస్తూ లో ఫ్లేమ్‌లో వేయించాలి. గోందు వేగిన తర్వాత పిండి వడియాల్లాగా పెద్దగా అయ్యి తెల్లగా మారుతుంది. ఇవి లోపల వరకు వేగకపోతే తినేటప్పుడు పళ్ళకు జిగురుగా అంటుకుపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేయించడం ముఖ్యం. వేగిన గోందును ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, పుచ్చగింజలు, బాదం పలుకులు వేసి సగం వేయించాలి. ఆ తర్వాత అర చిప్ప తురిమిన ఎండుకొబ్బరి వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

3 / 5
అదే కడాయిలో మరొక స్పూన్ నెయ్యి వేసి, ముందుగా రవ్వలా తయారు చేసుకున్న గోధుమపిండిని వేసి లో ఫ్లేమ్‌లో ఉంచి, రంగు మారి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి. గోధుమపిండి చక్కగా వేగి పొడిపొడిలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
తర్వాత, వేయించి పెట్టుకున్న గోందును చేతితో క్రష్ చేయాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లో క్రష్ చేసిన గోందు, అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, వేయించిన గోధుమపిండి వేసి బాగా కలపాలి.

అదే కడాయిలో మరొక స్పూన్ నెయ్యి వేసి, ముందుగా రవ్వలా తయారు చేసుకున్న గోధుమపిండిని వేసి లో ఫ్లేమ్‌లో ఉంచి, రంగు మారి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి. గోధుమపిండి చక్కగా వేగి పొడిపొడిలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత, వేయించి పెట్టుకున్న గోందును చేతితో క్రష్ చేయాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లో క్రష్ చేసిన గోందు, అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, వేయించిన గోధుమపిండి వేసి బాగా కలపాలి.

4 / 5

ఇప్పుడు బెల్లం పాకం కోసం, స్టవ్ మీద కడాయి పెట్టి, ముప్పావు కప్పు బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి లో ఫ్లేమ్‌లో కరిగించాలి. బెల్లం కరిగి తీగపాకం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఈ పాకాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న లడ్డూ మిశ్రమంలో వడకట్టి వేయాలి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలిపి, ఆ తర్వాత చేత్తో బాగా ఒత్తుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి.

5 / 5
ఈ గోందు లడ్డూలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా, డెలివరీ అయిన మహిళలకు నడుము, ఎముకలు గట్టిపడటానికి, త్వరగా కోలుకోవడానికి ఇవి సంప్రదాయకంగా ఇస్తారు. ఈ లడ్డూలు ఫ్రిజ్‌లో పెట్టకుండానే పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే, గోందు కతీరా అనేది వేసవిలో చలవ కోసం వాడే జిగురు అని, గోందు మాత్రం శీతాకాలానికి ప్రయోజనకరమని గుర్తుంచుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us