
ప్రపంచంలోనే మరో అద్భుతం దుబాయ్ మాల్. 5.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ మాల్ ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్, దానిలో అరుదైన చేపలతో సహా 300 రకాల సముద్ర జీవులు ఉన్నాయి.

The Palm Jumeirah- Man-Made Wonder: ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మక ఆలోచన ఇది.. ఇక్కడ మనిషి ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మించాడు. మీరు ఇక్కడ విమానంలో ప్రయాణించినట్లయితే, ఆకాశం నుండి అనేక మానవ నిర్మిత కృత్రిమ ద్వీపాలను చూడొచ్చు. ఎడారి, లోతైన సముద్రగర్భం నుండి 94 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవలసి ఉన్నందున ఈ ద్వీపాల నిర్మాణం మామూలు విషయం కాదు. దీంతో పాటు మరో చోట నుంచి 5.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లను కూడా ఇక్కడికి తరలించాల్సి వచ్చింది. ఇలా నిర్మించిన దీవుల్లో పామ్ ఐలాండ్ చాలా ప్రసిద్ధి చెందింది.

the burj khalifa building: బుర్జ్ ఖలీఫాలో కొన్ని అందమైన నీటి ఫౌంటెన్‌లు నిర్మించబడ్డాయి. ఈ ఫౌంటైన్‌లు స్థానిక, అంతర్జాతీయ పాటలకు కూడా స్టెప్పులేస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులను అలరించడానికి ఈ ఫౌంటెన్ నిర్మించబడింది. బుర్జ్ ఖలీఫా ఈ ఫౌంటెన్ 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

gold atm machines in dubai: ఏటీఎంలో బంగారం దొరుకుతుందంటే..ముక్కున వేలేసుకోవాల్సిందే..! కానీ, దుబాయ్‌లో కూడా అలాంటి వ్యవస్థ ఉంది. దుబాయ్ నగరంలో సూపర్ రిచ్ వ్యక్తులు ఉన్న ఏరియాలో ఏటీఎం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బంగారు ATMలు ఉన్నాయి. ఈ బంగారు ATMలలో మీకు బంగారు బిస్కెట్లు, నాణేలను లభిస్తాయి.. ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ ప్రపంచంలోనే ఇటువంటి బంగారు ATMని ఏర్పాటు చేసిన మొదటి హోటల్.

Sky High Tennis Courts- దుబాయ్ నగరంలో అత్యధిక ఎత్తులో టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో ఇక్కడ టెన్నిస్ ఆడవచ్చు. ఇది సరదాగా ఉంటుంది. ఈ టెన్నిస్ కోర్ట్ బుర్జ్ అల్ అరబ్ హోటల్ పైన నిర్మించబడింది. ఈ మైదానంలో 2005లో టెన్నిస్ ప్రతిభావంతులు రోజర్ ఫెదరర్, ఆండ్రీ అగస్సీతో ఒక టోర్నమెంట్ నిర్వహించబడింది. ఈ హోటల్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే.. చుట్టూ నీటిలో తన సొంత కృత్రిమ ద్వీపం మధ్యలో ఉంటుంది.