
ఆ జ్యూస్ మరేదో కాదండి.. గోధుమ గడ్డి జ్యూస్. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే, ఎంత ఖర్చు అయినా సరే దీనిని తాగడానికి ఎగబడుతున్నారు.

గోధుమ గడ్డి జ్యూస్ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. నీరసంగా ఉన్నవారు దీనిని తీసుకుంటే లేచి పరుగెడతారు. అలాగే, జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలసటను పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే, బరువును తగ్గించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది.

రక్తం తక్కువగా ఉన్నవారు ఈ జ్యూస్ ను తాగడం వరుసగా తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలకు రాకుండా చేస్తుంది.

ఉదయం పరగడుపున 30 నుంచి 50 ఎమ్ ఎల్ తీసుకుంటే చాలా మంచిది. ఇలా తాగితే, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పోటు రాకుండా చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)